Mrunal Thakur : వాళ్లపై ఘాటు కామెంట్స్ ఈ వీడియో వైరల్ అవుతుందని చెప్పి మరి షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్..!
బాలీవుడ్ లో హీరోయిన్ గా చేస్తున్నా సరే మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కి టాలీవుడ్ సూపర్ క్రేజ్ తెచ్చి పెట్టింది. అమ్మడు అక్కడ చేసిన సినిమాల కన్నా
- By Ramesh Published Date - 10:19 PM, Sun - 28 January 24

బాలీవుడ్ లో హీరోయిన్ గా చేస్తున్నా సరే మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కి టాలీవుడ్ సూపర్ క్రేజ్ తెచ్చి పెట్టింది. అమ్మడు అక్కడ చేసిన సినిమాల కన్నా తెలుగులో చేసిన సీతారామం సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో నార్త్ లో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది.
We’re now on WhatsApp : Click to Join
ఇక సీతారామం తర్వాత హాయ్ నాన్నతో కూడా సూపర్ హిట్ అందుకుంది మృణాల్ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మృణాల్ టాలీవుడ్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అమ్మడు బాలీవుడ్ సినిమాల మీద షాకింగ్ కామెంట్ చేసింది.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమా పరిశ్రమ తనకు ఇచ్చిన ఈ గుర్తింపు చాలా ప్రత్యేకమని అన్నది. అయితే తెలుగులో తను లవ్ అండ్ ఎమోషనల్ సినిమా వస్తున్నాయి. కానీ బాలీవుడ్ లో తనతో కేవలం రొమాంటిక్ సినిమాలే చేస్తున్నారు. అక్కడ లవ్ అండ్ ఎమోషనల్ సినిమాలకు తాను ఇంకా అర్హత సాధించలేదని అంటుంది. ఈ కామెంట్స్ వైరల్ గా మారుతాయని తనకు తెలుసు కానీ తన అభిప్రాయం చెప్పగలనని అంటుంది మృణాల్ ఠాకూర్.
తెలుగులో ఆమె టాలెంట్ గుర్తించి అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ సినిమాల్లో తను లవ్ స్టోరీస్ చేస్తున్నానని అంటుంది మృణాల్. అయితే బాలీవుడ్ మేకర్స్ కి మాత్రం తను కనిపించట్లేదని అక్కడ తనని రొమాంటిక్ సినిమాలకే తీసుకుంటున్నారని అంటుంది.
మృణాల్ చేసిన కామెంట్స్ కొంతమంది బాలీవుడ్ ఆడియన్స్ కి ఇబ్బందిగా ఉన్నా ఆమె చెప్పిన దానిలో ఎంతోకొంత వాస్తవం లేకపోలేదని చెప్పొచ్చు. హాయ్ నాన్నతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది.