Monica Bedi : విజిటింగ్ కార్డు ఇచ్చి.. రమ్మని పిలిచాడు ఆ దర్శకుడు.. కోపంతో కార్డు చించేసా.. కానీ..
ఓ పార్టీలో రాకేశ్ రోషన్ (హృతిక్ రోషన్ తండ్రి) మోనికా బేడీ దగ్గరకి వచ్చి కొంతసేపు మాట్లాడట. ఆ తరువాత వెళ్లిపోయేటప్పుడు ఆమెకు విజిటింగ్ కార్డు ఇస్తూ.. రేపు ఒకసారి ఇంటికి వచ్చి కలవమని చెప్పాడట.
- By News Desk Published Date - 10:28 PM, Thu - 20 July 23

బాలీవుడ్(Bollywood) బ్యూటీ మోనికా బేడీ(Monica Bedi) హిందీలో ఓ సినిమాతో వెండితెర అరంగేట్రం ఇచ్చింది. అయితే మొదటి సినిమా ఆశించిన గుర్తింపు తెచ్చిపెట్టలేదు. రెండో మూవీని 1995లో శ్రీకాంత్(Srikanth) హీరోగా తెరకెక్కిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ తాజ్ మహల్ (Taj Mahal) చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మంచి గుర్తింపు రావడంతో బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ సాగింది. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. తన లైఫ్ లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని అందరితో పంచుకుంది.
బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సుభాష్ ఘై హోలీ నిర్వహించిన పార్టీలో రాకేశ్ రోషన్ (హృతిక్ రోషన్ తండ్రి) మోనికా బేడీ దగ్గరకి వచ్చి కొంతసేపు మాట్లాడట. ఆ తరువాత వెళ్లిపోయేటప్పుడు ఆమెకు విజిటింగ్ కార్డు ఇస్తూ.. రేపు ఒకసారి ఇంటికి వచ్చి కలవమని చెప్పాడట. అయితే రాకేశ్ రోషన్ పిలిచింది ఆమెకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వడానికి. ఆయన దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ హీరోలుగా తెరకెక్కిన ‘కరణ్ అర్జున్’ అనే సినిమాలో ఆమెను హీరోయిన్ గా పెడదామని రాకేశ్ రోషన్ అనుకున్నారు. అందుకనే మోనికా బేడీని ఒకసారి వచ్చి కలవమని చెప్పారు.
అయితే మోనికాకి అతడు నటుడన్న విషయం తెలుసు గాని నిర్మాత, దర్శకుడు అన్న విషయాలు తెలియదు. దీంతో రాకేశ్ రోషన్ తప్పుడు ఉద్దేశంతో ఆమెను రమ్మన్నాడని అనుకోని ఆ కార్డుని అక్కడే చింపి పడేసింది. ఇక కొన్ని నెలలు తరువాత ఆమె మేనేజర్ వచ్చి.. “రాకేశ్ రోషన్ ను ఎందుకు కలవలేదు? అతడు తీస్తున్న కరణ్ అర్జున్ సినిమాలో నీకు సల్మాన్ ఖాన్ సరసన ఛాన్స్ ఇద్దామని అనుకున్నారట” అని చెప్పడం అసలు విషయం తెలిసింది. దీంతో ఆమె చేసిన తప్పేంటో అప్పుడు అర్ధమైంది. కాగా ఆమె పాత్రని ఆ సినిమాలో మమత కులకర్ణి పోషించింది.
Also Read : Allari Ramudu : సినిమా యావరేజ్.. కానీ కలెక్షన్స్ లెక్కపెట్టడానికి మాత్రం చేతులు నొప్పి వచ్చాయట..