Monalisa Bhosle : మోనాలిసా కు ఫస్ట్ మూవీ ఛాన్స్..డైరెక్టర్ ఎవరంటే..!
Monalisa Bhosle : తాజాగా డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన తర్వాతి సినిమాలో మోనాలిసా కు ఛాన్స్ ఇస్తానని వెల్లడించారు
- By Sudheer Published Date - 03:47 PM, Tue - 28 January 25

మహాకుంభా మేళా ఫేమ్ మోనాలిసా(Monalisa Bhosle) కు ఫస్ట్ మూవీ ఛాన్స్ వచ్చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా గత పది రోజులుగా సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లి కళ్లు, డస్కీ స్కిన్‌తో సెన్సేషన్‌గా మహాకుంభా మేళాలో సహజ సౌందర్యం, అమాయకపు చిరునవ్వుతో కుర్రకారును కట్టిపడేసింది. కుంభమేళా లో ఈమెనే హైలైట్ గా నిలిచింది. ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ద్వారా.. ప్రస్తుతం దేశం మొత్తం ఈమె గురించి మాట్లాడుకునేలా అయ్యింది. మోనాలిసాను చూసి ఆమెను వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆమె వద్దకు చేరుకుని ఇంటర్వ్యూలు చేయడం ఆమెను స్టార్ ను చేయడం చకచకా జారిపోయింది. ఇక ఇప్పుడు ఈ స్టార్డం ఆమెకు సినిమా ఛాన్స్ వచ్చేలా చేసింది.
Eco Friendly Experience Park : ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
తాజాగా డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన తర్వాతి సినిమాలో మోనాలిసా కు ఛాన్స్ ఇస్తానని వెల్లడించారు. “ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్” సినిమా తీస్తున్న డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. తన తదుపరి సినిమా అయిన “ది డైరీ ఆఫ్ మణిపూర్” తీయనున్నారు. ఆ సినిమాలో మోనాలిసాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో మోనాలిసాను కలిసి.. ఆమెతో సినిమా తీసేందుకు సనోజ్ మిశ్రా ఒప్పందంపై సంతకం చేయించుకోనున్నారు. మణిపూర్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ సైనికుడి కుమార్తె పాత్రలో ఆమె నటించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆ అమ్మాయికి సైన్యంలో చేరాలని కలగంటుందని.. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఆమె ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుంది.. ఆ ప్రయాణంలో ఆమెకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి.. వాటన్నింటినీ దాటుకుని ఆమె తన కలను ఎలా నెరవేర్చుకోగలుగుతుంది అనేదే “ది డైరీ ఆఫ్ మణిపూర్” సినిమా స్టోరీ అని సనోజ్ మిశ్రా వెల్లడించారు. ఇక ఇప్పటికే మోనాలిసా తండ్రితో సనోజ్ మిశ్రా ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. మరోపక్క మోనాలిసా కూడా సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూ లో తెలుపడం కూడా ఆమెకు ఛాన్స్ వచ్చేలా చేసింది.