Mokshagna : స్టార్ తనయురాలితో మోక్షజ్ఞ జోడీ..!
Mokshagna స్టార్ తనయుడితో స్టార్ వారసురాలి జోడీ కట్టడం సంథింగ్ స్పెషల్ గా ఉందని చెప్పొచ్చు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- By Ramesh Published Date - 11:37 PM, Sun - 27 October 24

నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు డిసెంబర్ 2న జరుగుతాయని తెలుస్తుంది. ఈ సినిమా పురాణాల కథతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం భారీ ప్లానింగ్ లోనే ఉన్నాడట. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ తనయురాలిని తీసుకొస్తున్నారని టాక్. బాలీవుడ్ భామ రవీనా టాండన్ కూతురు రాశి థదని ని మోక్షజ్ఞ కోసం దించుతున్నారట.
రాశి (Rashi Thadani) ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. మోక్షజ్ఞ (Mokshagna) సినిమాతోనే ఆమె ఎంట్రీ ఇవ్వబోతుంది. స్టార్ తనయుడితో స్టార్ వారసురాలి జోడీ కట్టడం సంథింగ్ స్పెషల్ గా ఉందని చెప్పొచ్చు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అ! సినిమా నుంచి హనుమాన్..
దాదాపు ఐదేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పుడు అప్పుడు అని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ కన్ఫర్మ్ చేయలేదు. కానీ ప్రశాంత్ వర్మ తో సినిమా ఫైనల్ చేశారు. అ! సినిమా నుంచి హనుమాన్ వరకు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ని సిద్ధం చేస్తున్నారు. ఐతే ఈ సినిమాతో పాటుగా మహాకాళి మోక్షజ్ఞ సినిమా కూడా ఉంది.
మోక్షజ్ఞ సినిమాపై ఫిల్మ్ నగర్ లో రకరకాల చర్చ జరుగుతుంది. కచ్చితంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు.
Also Read : Dulquer Salman : దుల్కర్ కూడా సొంతది వాడేస్తునాడుగా..?