Megastar Chiranjeevi: సంక్రాంతి రేసులో చిరు.. ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య విడుదల తేదీని ఫిక్స్ అయ్యింది.
- By Balu J Published Date - 04:48 PM, Wed - 7 December 22

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మహారాజా రవితేజ్, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. చిరంజీవి, దర్శకుడు బాబీ క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) థియేటర్లలో పూనకాలు అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి రానున్న సంగతి తెలిసిందే. మేకర్స్ అధికారికంగా ప్రకటించినట్లుగా ఇది జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
చిరంజీవి (Megastar Chiranjeevi) సంక్రాంతికి చాలా బ్లాక్‌బస్టర్‌లను అందించారు. పండుగకు థియేటర్లలో మాస్ పార్టీని అందించడానికి మరొక బ్లాక్‌బస్టర్ లోడ్ అవుతోంది. ఈ మేరకు విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. పోస్టర్‌లో చిరంజీవి పాతకాలపు మాస్ అవతార్‌లో లుంగీ, వైబ్రెంట్ షర్ట్‌తో హెడ్‌బ్యాండ్‌తో ఉన్నారు. ఈ పోస్టర్ ఒక్కటే పూనకాలు ఇచ్చేలా ఉంది. బాస్ పార్టీ ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా మారడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టింది టీం.
ఊర్వశి రౌతేలా చిరంజీవి (Megastar Chiranjeevi) సరసన డాన్స్ చేయడం, మాస్ స్టెప్పులు వేయడం అభిమాలను అలరించింది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.
Also Read: Raashi Khanna Pics: అందాల రాశి.. ఎద అందాలు ఆరబోసి!
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
కథ, మాటలు, దర్శకత్వం: కెఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
DOP: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానె
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: GK మోహన్, ప్రవీణ్ M
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
అదనపు రచన: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
CEO: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో