Megastar Chiranjeevi Viswambhara : విశ్వంభర యాక్షన్ సీన్స్ అప్డేట్.. మెగా ఫ్యాన్స్ కి రియల్ ట్రీట్..!
Megastar Chiranjeevi Viswambhara మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ మూవీ విశ్వంభర సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్
- By Ramesh Published Date - 12:25 PM, Mon - 18 March 24
Megastar Chiranjeevi Viswambhara మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ మూవీ విశ్వంభర సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో 150 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి కూడా మరో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో ఈషా చావ్లా, సురభి లాంటి హీరోయిన్స్ కూడా భాగం అవుతున్నారని తెలుస్తుంది.
సినిమాలో ఈమధ్యనే ఒక సాంగ్ షూట్ చేశారని తెలుస్తుండగా ప్రస్తుతం సినిమాకు సంబందించిన ఒక యాక్షన్ పార్ట్ షూట్ చేస్తున్నారట. ప్రస్తుతం సినిమాలో ఒక మట్టి ఫైట్ షూట్ చేశారని తెలుస్తుంది. మట్టి, వాటర్ ఈ రెండిటిలో ఈ ఫైట్ సీక్వెన్స్ జరిపారట. ఇది చాలా రియలిస్టిక్ గా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో చిరుని వింటేజ్ లుక్ తో చూపించే ప్రయత్నం జరుగుతుంది.
బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వశిష్ట తన సెకండ్ సినిమానే చిరుతో లాక్ చేసుకున్నాడు. విశ్వంభర సినిమా విజువల్ ఫీస్ట్ అందిస్తుందని మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ విషయంలో కూడా అదరగొడుతుందని అంటున్నారు.
Also Read : Premalu : తెలుగు రాష్ట్రాల్లో ప్రేమలు పరిస్థితి ఏంటి..?