Chiranjeevi Sensation Tweet: పొలిటికల్ ఎంట్రీపై చిరు సంచలనం.. ట్వీట్ వైరల్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ మెసేజ్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఆయన చేసిన ట్వీట్ చర్చను లేవనెత్తుతోంది.
- Author : Balu J
Date : 20-09-2022 - 2:24 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ మెసేజ్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఆయన చేసిన ట్వీట్ అభిమానులు, రాజకీయ నాయకులలో చర్చను లేవనెత్తుతోంది. చిరంజీవి ట్విట్టర్ లో వాయిస్ మెసేజ్ షేర్ చేశారు. అందులో ‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. కానీ.. రాజకీయాలు నా నుంచి పోలేదు’’ అంటూ వాయిస్ ఇచ్చారు. ఇది చిరు రాబోయే చిత్రం గాడ్ ఫాదర్‌లోని డైలాగ్ అని, అభిమానులు, నెటిజన్లు చాలా మంది చెబుతున్నారు.
చిరంజీవి తన గాడ్ ఫాదర్ చిత్రం ద్వారా సినీ అభిమానులను అలరించబోతున్నారు. అక్టోబర్ 5న వెండితెరపైకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు మేకర్స్. రానున్న పదిరోజుల్లో గాడ్ ఫాదర్ టీం ప్రమోషన్ల జోరు పెంచనుంది. అయితే చిరు వాయిస్ మెసేజ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిందా.. లేదా గాడ్ ఫాదర్ మూవీకి హైప్ క్రియేట్ చేయడానికా? అనేది తేలాల్సి ఉంది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2022