Miss Shetty Mr Polishetty : అందరికంటే ముందే ఆ సినిమా చూసేసిన చిరంజీవి.. రివ్యూ కూడా ఇచ్చేశారుగా..
తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రయూనిట్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ని కలిసి సినిమా చూపించారు.
- Author : News Desk
Date : 05-09-2023 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty), స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) కాంబినేషన్‌లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’(Miss Shetty Mr Polishetty) సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో చేస్తుంది. నవీన్ గత కొన్ని రోజులుగా సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు.
తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రయూనిట్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ని కలిసి సినిమా చూపించారు. ఈ సినిమా చూసిన చిరంజీవి అందరికంటే ముందు తనే ఈ సినిమా చూశాను అంటూ సినిమా రివ్యూని(Movie Review) తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాని చిరంజీవి చుసిన అనంతరం టీంతో కలిసిన దిగిన ఫోటోలను షేర్ చేస్తూ సినిమా రివ్యూగా.. ‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి ‘దేవసేన’, అనుష్క శెట్టిలు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేష్ బాబుని అభినందించాల్సిందే. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు అని రాస్తూ చిత్రయూనిట్ కి అభినందనలు తెలిపారు.

దీంతో చిరంజీవి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా గురించి రాసిన రివ్యూ, నవీన్ తో దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read : Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు నుంచి ఏక్ దమ్ ఏక్ దమ్ లిరికల్ సాంగ్ రిలీజ్