Megastar Chiranjeevi Maruthi : మారుతికి మెగాస్టార్ ఛాన్స్ ఇస్తాడా..?
Megastar Chiranjeevi Maruthi టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు మారుతి. సినిమా తీయాలన్న తపన ఉండాలే కానీ ఎలాగైనా
- By Ramesh Published Date - 10:57 AM, Fri - 27 October 23

Megastar Chiranjeevi Maruthi టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు మారుతి. సినిమా తీయాలన్న తపన ఉండాలే కానీ ఎలాగైనా తీసేయొచ్చు అని ఈరోజుల్లో సినిమాను తీసి దాన్ని ప్రమోట్ చేసి యూత్ ని ఎట్రాక్ట్ చేశాడు. అయితే ముందు కొన్ని యూత్ ఫుల్ సినిమాలు చేసినా ఆ తర్వాత పూర్తిగా ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్న మారుతి ఈ సినిమా తర్వాత మెగా ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది.
ప్రభాస్ సినిమా తర్వాత మారుతి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. భోళాశంకర్ ఇచ్చిన షాక్ తో రీమేక్ ల జోలికి వెళ్లెకూడదని ఫిక్స్ అయిన చిరంజీవి ఒరిజినల్ కథలకే ఓటు వేస్తున్నాడు. ఈ క్రమంలో మారుతి ఒక లైన్ చెప్పగా అది నచ్చి బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్టు టాక్.
ప్రభాస్ (Prabhas) సినీమ తర్వాత మెగాస్టార్ సినిమా పడితే మాత్రం తప్పకుండా మారుతి రేంజ్ మారినట్టే అని చెప్పొచ్చు. చిరంజీవే తనలోని దర్శకుడిని గుర్తించాడని అంతకుముందు ఒకసారి చెప్పిన మారుతి ఆయన్ని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అని మెగా ఫ్యాన్స్ అంతా ఉత్సాహంగా ఉన్నారు. మారుతి మెగాస్టార్ సినిమా కన్ఫర్మ్ అయితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.
Also Read : Sri Leela : దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తున్న శ్రీ లీల నిర్ణయం..!