Chiranjeevi : సినిమా బడ్జెట్ కంటే రీ రిలీజ్ బడ్జెట్ నాలుగు రేట్లు ఎక్కువ.. మెగాస్టార్ సినిమా..
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి.
- By News Desk Published Date - 09:24 AM, Wed - 7 May 25

Chiranjeevi : ఇటీవల పాత సూపర్ హిట్ సినిమాలను డిజిటల్ గా మార్చి 4K, 8K రిజల్యూషన్స్ లో మార్చి రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులకు మంచి అనుభవం ఇవ్వడానికి బాగానే కషటపడుతున్నారు, ఖర్చుపెడుతున్నారు కూడా. అయితే చిరంజీవి రీ రిలీజ్ సినిమాకి సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టారంట.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి. ఈ సినిమాని మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. 1990 లో ఈ సినిమాని 2 కోట్లతో తెరకెక్కిస్తే ఆల్మోస్ట్ 15 కోట్లు కలెక్ట్ చేసి భారీ విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని రీ రిలీజ్ చేయడానికి సినిమా రీల్స్ ని జాగ్రత్తగా డిజిటలైజ్ చేసి 8K లోకి మార్చి, అలాగే 3D లోకి కూడా మార్చి అద్భుతమైన ప్రింట్ తో రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఇదంతా చేయడానికి రీ రిలీజ్ లో ఈ సినిమాకు 8 కోట్లు ఖర్చు అయినట్టు సమాచారం. సినిమాని డిజిటల్ చేయడానికి, ప్రమోషన్స్ కి అంతా కలిపి ఈ బడ్జెట్ అని తెలుస్తుంది. అంటే అసలు సినిమా బడ్జెట్ కంటే ఆల్మోస్ట్ నాలుగు రెట్లు ఎక్కువ. దీంతో రీ రిలీజ్ కి ఇంత ఖర్చుపెట్టారా అని ఆశ్చర్యపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది అని ఫ్యాన్స్ అంటున్నారు. మరి రీ రిలీజ్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఎన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.
Also Read : Faria Abdullah : పవన్ కళ్యాణ్‌తో డేటింగ్ కు రెడీ అంటున్న యంగ్ హీరోయిన్