Allu Arjun Arrest : నచ్చితే నువ్వు వస్తావు..కానీ కష్టం వస్తే మెగా హీరోలు వస్తారు
Allu Arjun Arrest : చిరంజీవి , నాగబాబు నేరుగా బన్నీ ఇంటికి చేరుకొని తమ మద్దతు తెలిపి , ఫ్యామిలీకి భరోసా ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలిసిన తర్వాత విజయవాడ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు
- Author : Sudheer
Date : 14-12-2024 - 2:15 IST
Published By : Hashtagu Telugu Desk
సంధ్య థియేటర్ (Sandhya Theater) వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన తొక్కిసలాట లో ఓ మహిళా మరణించడం..సంధ్య థియేటర్ యాజమాన్యం తో పాటు అల్లు అర్జున్ , అలాగే మేనేజర్ పై పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగా నిన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ (Allu Arjun Arrest) చేయడం, రిమాండ్ కు తరలించడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాత్రి వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ..జైలు అధికారులు పత్రాలు సరిగా లేవని చెప్పి , శనివారం ఉదయం రిలీజ్ చేసారు. నిన్న బన్నీ అరెస్ట్ దగ్గరి నుండి ఈరోజు రిలీజ్ వరకు అంత ట్విస్ట్ లతో సాగింది. అల్లు అర్జున్ అరెస్ట్ వార్త తెలిసి యావత్ అభిమానులు షాక్ అయ్యారు. మొన్నటి వరకు అల్లు అర్జున్ పై కాస్త ఆగ్రహంగా ఉన్న మెగా అభిమానులు (Mega Fans) సైతం రోడ్లపైకి వచ్చి బన్నీ కి మద్దతు తెలిపారు.
ఇక మెగా బ్రదర్స్ చిరంజీవి , నాగబాబు , పవన్ కళ్యాణ్ (Chiranjeevi , Nagababu , Pawankalyan) లు సైతం బన్నీ అరెస్ట్ వార్త విని షాక్ అయ్యారు. చిరంజీవి , నాగబాబు నేరుగా బన్నీ ఇంటికి చేరుకొని తమ మద్దతు తెలిపి , ఫ్యామిలీకి భరోసా ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఈ విషయం తెలిసిన తర్వాత విజయవాడ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈరోజు అల్లు అర్జున్ బయటకు వచ్చాడంటే దీనివెనుక చిరంజీవి , పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పాలి. ఇది అల్లు అర్జున్ కు కూడా తెలుసు. గతంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం..ఆ తర్వాత కూడా నాకు నచ్చితేనే చేస్తాను..నచ్చిన వారికోసం ఎక్కడికైనా వస్తాను అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. కానీ మెగా హీరోలు మాత్రం అవేమి పట్టించుకోకుండా ఈరోజు అల్లు అర్జున్ కష్టాల్లో ఉన్నాడని తెలిసి నేరుగా ఇంటికి వచ్చి భరోసా ఇవ్వడం, అల్లు అర్జున్ ను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయడం ఇవ్వన్నీ కూడా మెగా హీరోల పెద్ద మనసుకు నిదర్శనం అని చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇంత జరుగుతున్నా కూడా నంద్యాల మాజీ ఎమ్మెల్యే, అల్లు అర్జున్ స్నేహితుడు శిల్పా రవి రెడ్డి మాత్రం ఎక్కడ స్పందించలేదు, కనీసం అరెస్ట్ గురించి కూడా పట్టించుకున్నట్లు కనిపించలేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా మనవాళ్ళు ఎవరో..పరాయి వాళ్ళు ఎవరో గమంచాలి.. ఇప్పటికైనా కళ్లు తెరిచి అర్ధం చేసుకోవాలి అని సలహా ఇస్తున్నారు.
We are extremely sorry for the family…I will personally be there to support them @alluarjun #AlluArjun #AlluArjunArrested #AlluArjun𓃵 #Hyderabad #Tollywood #AlluArjunArrestedNews #AlluArjunReleased #Pushpa2ThaRule #HashtagU pic.twitter.com/oFNhdVTzY3
— Hashtag U (@HashtaguIn) December 14, 2024
Read Also : Law and order : కేంద్రహోమంత్రి అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ