Aha : ఆహా టీమ్ ఫై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం
ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ..చిరంజీవి ని ఏ ఏ ప్రశంలు అడుగుతారు..? పవన్ కళ్యాణ్ రాజకీయాల ఫై ఏమైనా అడుగుతారా..? చంద్రబాబు అరెస్ట్ గురించి ఏమైనా ఆరా తీస్తారా..? అంటూ ఇలా ఎవరికీ వారు మాట్లాడుకోవడం చేసారు. కానీ ఇప్పుడు ఈ మాటలన్నీ గాల్లో కలిపారు
- Author : Sudheer
Date : 09-10-2023 - 7:50 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు మొదటి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా (Aha) ఫై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం తో ఊగిపోతున్నారు. ఆహా లో నందమూరి బాలకృష్ణ (Nandhamuri Balakrishna) హోస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తికాగా ..ఇప్పుడు మూడో సీజన్ ప్రసారం కాబోతుంది. ఈ క్రమంలో ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ కావడం తో అంత నిజమే కావొచ్చని..ఆ ఎపిసోడ్ ఫై అంచనాలు పెంచుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ చూద్దామా అని ఎదురుచూడడం చేసారు. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ..చిరంజీవి ని ఏ ఏ ప్రశంలు అడుగుతారు..? పవన్ కళ్యాణ్ రాజకీయాల ఫై ఏమైనా అడుగుతారా..? చంద్రబాబు అరెస్ట్ గురించి ఏమైనా ఆరా తీస్తారా..? అంటూ ఇలా ఎవరికీ వారు మాట్లాడుకోవడం చేసారు. కానీ ఇప్పుడు ఈ మాటలన్నీ గాల్లో కలిపారు ఆహా టీం.
We’re now on WhatsApp. Click to Join.
చిరంజీవి మొదటి ఎపిసోడ్ కి రావడం లేదని చెబుతూ ఈసారి ఎవరు ఎవరు వస్తున్నారనేది ఆహా టీం వెల్లడించేసింది. దసరా కంటే ముందుగానే ప్రసారమయ్యే మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం రాబోతుందని ఆహా టీం రాబోతుందని క్లారిటీ ఇచ్చేసింది. ఈ ఎపిసోడ్ లో దర్శకుడు అనిల్ రావిపూడి, కాజల్ అగర్వాల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్ హాజరుకాబోతున్నట్లు తెలిపారు. ఈ కబురు తో మెగా ఫ్యాన్స్ నిరాశకు గురికాగా..నందమూరి అభిమానులు సైతం డిస్పాయింట్ అయ్యారు.
ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే..ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా…శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి రిలీజ్ కానుంది.
Read Also : Rajinikanth Suriya : సూర్య నటన చూసి.. వీడు ఎలా నటుడు అయ్యాడు.. అనుకున్నాడట రజినీకాంత్..