Niharika Konidela Re Entry : మెగా డాటర్ నిహారిక రీ ఎంట్రీ ఫిక్స్.. కంబ్యాక్ ఈ రేంజ్ లో ఉండబోతుందా..?
Niharika Konidela Re Entry మెగా డాటర్ నిహారిక మళ్లె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. తెలుగులో ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన నిహారిక ఆ సినిమా తర్వాత
- By Ramesh Published Date - 07:56 AM, Fri - 2 February 24

Niharika Konidela Re Entry మెగా డాటర్ నిహారిక మళ్లె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. తెలుగులో ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన నిహారిక ఆ సినిమా తర్వాత నాలుగైదు ప్రయత్నాలు చేసింది. కానీ అవేవి వర్క్ అవుట్ కాలేదు. లాస్ట్ టైం సూర్యకాంతం సినిమా చేయగా అది కూడా వర్క్ అవుట్ కాలేదు.
We’re now on WhatsApp : Click to Join
ఇక కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి చైతన్య జొన్నలగడ్డ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. అయితే పెళ్లి జీవితం సుఖంగా ఉంటుందని అనుకుంటే అనుకోని కారణాల వల్ల నిహారిక చైతన్య డైవర్స్ తీసుకున్నారు.

Niharika
ఆమె డైవర్స్ కు కారణాలు ఏంటన్నది తెలియదు కానీ మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సింగిల్ గానే ఉంటుంది. ఇక ఎలాగు ఫ్రీనే కదా అని మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది అమ్మడు. మలయాళ యువ హీరో షేన్ నిగం తో కలిసి జత కడుతుంది. షేన్ నిగం ఈమధ్య మలయాళంలో ట్రెండింగ్ లో ఉన్నాడు. అతని నటిస్తున్న మద్రాస్ కారన్ సినిమాలో నిహారిక హీరోయిన్ గా నటిస్తుంది.
ఎస్.ఆర్ ప్రొడ్క్షన్స్ లో వాలి మోహన్ దాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా నుంచి అఫీషియల్ పోస్టర్ కూడా వచ్చేసింది. నిహారిక బిఫోర్ మ్యారేజ్ వరుస సినిమాలు చేసింది. ఫలితాలు ఎలా ఉన్నా ఆమె సినిమాల్లో నటించాలని బలంగా కోరుకుంది. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ కేవలం ప్రొడక్షన్ సైడ్ మాత్రమే పనిచేసింది కానీ తెర మీద కనిపించలేదు.
Also Read : Naturalstar Nani : ఓజీ డైరెక్టర్ తో నాని.. కాంబో కుదిరితే మాత్రం నాని లెవె మారినట్టే..!
ఫైనల్ గా ఇన్నాళ్లకు మళ్లీ నిహారిక సోలో సినిమా చేస్తుంది. మెగా ఫ్యాన్స్ అందరికీ ముఖ్యంగా మెగా డాటర్ నిహారిక సినిమాలను ఇష్టపడే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.