Meenakshi Chaudhary : మీనాక్షి ఫాం మాములుగా లేదుగా..?
Meenakshi Chaudhary మహేష్ తో గుంటూరు కారం, విజయ్ తో గోట్ సినిమాలు చేసిన మీనాక్షి ఆ రెండు సినిమాల వల్ల తనకు ఎలాంటి లాభం వచ్చేలా చేసుకోలేదు. ఐతే మీనాక్షి ప్రస్తుతం 3 సినిమాల్లో
- Author : Ramesh
Date : 21-10-2024 - 11:22 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగులో హీరోయిన్స్ కొరత కొనసాగుతూనే ఉంది. కొందరు హీరోయిన్స్ మాత్రమే స్టార్ క్రేజ్ సంపాదించి కొన్నాళ్ల పాటు ఆ ఫాం కొనసాగిస్తుంటే మరికొందరు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. ఐతే ఉన్న వారిలో కాస్త స్టార్ మెటీరియల్ అనిపించిన వారిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాంటి వారిలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ఒకరు. సుశాంత్ తో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు ఆ సినిమా నుంచి వరుస ఛాన్సులు అందుకుంటుంది.
ఐతే ఈ ఇయర్ మహేష్ తో గుంటూరు కారం, విజయ్ తో గోట్ సినిమాలు చేసిన మీనాక్షి ఆ రెండు సినిమాల వల్ల తనకు ఎలాంటి లాభం వచ్చేలా చేసుకోలేదు. ఐతే మీనాక్షి ప్రస్తుతం 3 సినిమాల్లో నటిస్తుంది. ఆ 3 సినిమాలు కూడా నెల గ్యాప్ తో రిలీజ్ అవుతున్నాయి. విశ్వక్ సేన్ (Viswak Sen) తో మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ తో మట్కా, దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) తో లక్కీ భాస్కర్ ఈ 3 సినిమాలతో మీనాక్షి అదరగొట్టేస్తుంది.
నెల లోపే 3 సినిమాలు..
నెల లోపే 3 సినిమాలు అది కూడా మంచి బజ్ ఉన్న సినిమాలు అవ్వడం వల్ల మీనాక్షికి మంచి ఛాన్స్ వచ్చినట్టు అయ్యింది. ఈ సినిమాలు సక్సెస్ అయితే మాత్రం తెలుగులో అమ్మడి రేంజ్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ మట్కా అయితే పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమాతో అమ్మడు నేషనల్ లెవెల్ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది.
మీనాక్షి చౌదరికి ఈ 3 సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ పడ్డా కూడా కచ్చితంగా అమ్మడి రేంజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ సినిమాల మీద తన ఫోకస్ పెడుతుంది అమ్మడు. ఈమధ్యనే రిలీజైన వరుణ్ తేజ్ (Varun Tej) మట్కా టీజర్ ఇంప్రెస్ చేయగా లేటెస్ట్ గా విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.
Also Read : Rajamouli RGV : రాజమౌళి.. ఆర్జీవి.. స్పెషల్ ఇంటర్వ్యూ..!