Meenakshi Chaudhary: శ్రీలీలకు షాక్ ఇచ్చిన మీనాక్షి చౌదరి, ఎందుకో తెలుసా?
మీనాక్షి చౌదరిని పూజాహెగ్డే పాత్ర కోసం ఫైనల్ చేశారట. ఆకట్టుకునే నటనతో చిత్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించిందని వర్గాలు సూచిస్తున్నాయి.
- By Balu J Published Date - 02:16 PM, Wed - 6 September 23

కొన్ని వారాల క్రితం పూజా హెగ్డే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “గుంటూరు కారం” లో తన పాత్ర నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన స్క్రిప్ట్ మార్పుల కారణంగా పూజా హెగ్డే ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చింది. అయితే మొదట్లో రెండవ కథానాయికగా నటించిన శ్రీ లీల ఆమె స్థానంలో ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకనిర్మాతలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
మీనాక్షి చౌదరిని పూజాహెగ్డే పాత్ర కోసం ఫైనల్ చేశారట. ఇటీవల సినిమాలతో మీనాక్షి ఆకట్టుకునే నటనతో చిత్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించిందని వర్గాలు సూచిస్తున్నాయి. సెకండ్ లీడ్‌గా నిలిచిన శ్రీలీల ఈ పరిణామంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ముందుగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీయాలనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల టాలీవుడ్ కే పరిమితం చేశారు.
అయితే ఈ మూవీకి మహేశ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ మారింది. ఈ సినిమాకు మహేశ్ రూ. 78 కోట్ల రూపాయలతోపాటు జీఎస్టీని అందుకోబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి సినిమాలో చేయనున్నాడు మహేశ్. ఈ మూవీ కోసం ఇప్పటి నుంచే తెగ కష్టపడుతున్నాడు సూపర్ స్టార్. అందుకు తగ్గట్టే జిమ్ లో చెమటొడిస్తున్నాడు.
Also Read: One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మొదటి సమావేశం