HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Maruthi Sorry To Ntr Fans

NTR : ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన ప్రభాస్ డైరెక్టర్

NTR : టాలీవుడ్ డైరెక్టర్ మారుతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'ది రాజాసాబ్' సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీసిన మారుతికి ఇది

  • Author : Sudheer Date : 24-11-2025 - 3:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maruthi Sorry
Maruthi Sorry

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘ది రాజాసాబ్’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీసిన మారుతికి ఇది గోల్డెన్ ఛాన్స్ కావడంతో, ఈ సినిమాను ఎలాగైనా హిట్ కొట్టి ప్రభాస్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ది రాజాసాబ్’ సినిమా నుంచి విడుదలైన ‘రెబల్ సాబ్’ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్ ఆదివారం బాలానగర్‌లోని విమల్ థియేటర్లలో జరిగింది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు అనవసరమైన వివాదాన్ని రాజేసి, రెబల్ స్టార్ ఫ్యాన్స్ మరియు యంగ్ టైగర్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాయి. మారుతి మాట్లాడుతూ..”ప్రభాస్ ఫోటో జేబులో పెట్టుకునే ఎవడైనా టాప్ డైరెక్టర్ అయిపోవచ్చని” చెప్పి, ఆపై ”రేపు పండక్కి ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకుంటారు అని నేను చెప్పను.. ఎందుకంటే ఈ కటౌట్ కి అవన్నీ చాలా చిన్న మాటలు అయిపోతాయి” అని అన్నారు.

మారుతి మాట్లాడిన ఈ ‘కాలర్ ఎగరేయడం’ అనే అంశంపైనే ఇప్పుడు వివాదం రేగింది. ఎందుకంటే, టాలీవుడ్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను ఉద్దేశించి ప్రతీ ఈవెంట్‌లో కాలర్ ఎగరేయడం అనేది ఒక ట్రేడ్‌మార్క్‌గా మారింది. ‘దేవర’ సినిమా ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని గతంలో తారక్ చెప్పడం, ‘వార్ 2’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఏకంగా రెండు కాలర్లు పైకి ఎత్తి చూపించడం వంటి సంఘటనల కారణంగా ‘కాలర్’ అనగానే అందరికీ ఎన్టీఆరే గుర్తుకొస్తారు. అందుకే మారుతి చేసిన ‘కాలర్’ కామెంట్స్ ఎన్టీఆర్ అభిమానులను ట్రిగ్గర్ చేశాయి. తమ హీరోను ఉద్దేశించే మారుతి ఆ వ్యాఖ్యలు చేశారంటూ, ప్రభాస్‌ను పొగిడే క్రమంలో ఎన్టీఆర్ కటౌట్‌ను తక్కువ చేసి మాట్లాడారని ఆరోపిస్తూ నెటిజన్లు మారుతిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో మారుతిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తూ, బూతులతో రెచ్చిపోవడంతో పాటు, పెద్ద హీరోతో సినిమా చేయగానే కొమ్ములొచ్చాయంటూ విమర్శించారు.

ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో డైరెక్టర్ మారుతి వెంటనే ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, ఎన్టీఆర్ అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. “ఎవరినీ బాధపెట్టడం, అగౌరవపరచడం నా ఉద్దేశ్యం కాదని” “స్టేజ్‌పై మాట్లాడే సమయంలో కొన్నిసార్లు మనం చెప్పాలనుకున్న దానికి పూర్తి భిన్నంగా విషయాలు బయటకు వస్తాయని” ఆయన పేర్కొన్నారు. తాను మాట్లాడిన దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు చింతిస్తున్నానని, తనకు ఎన్టీఆర్ పట్ల, ఆయన అభిమానులందరి పట్ల అపారమైన గౌరవం ఉందని, తాను ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదని పూర్తి నిజాయితీతో వివరణ ఇచ్చారు. ఈ వివాదం, సినీ ప్రముఖులు స్టేజీల మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఆలోచించి మాట్లాడాలని మరోసారి స్పష్టం చేసింది. మారుతి వివరణతోనైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ శాంతిస్తారా లేదా అనేది వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • maruthi
  • Maruthi comments ntr
  • ntr
  • prabhas
  • the raja saab song release

Related News

Japan Earthquakes Prabhas

Japan Earthquake : ప్రభాస్ ఎలా ఉన్నాడంటూ ఫ్యాన్స్ లో అందోళన

Japan Earthquake : ప్రభాస్ మరియు ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ కలసి తమ మైలురాయి చిత్రం 'బాహుబలి: ది ఎపిక్' ప్రచార కార్యక్రమాలలో భాగంగా జపాన్‌ను సందర్శిస్తున్నారు

    Latest News

    • రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ రూ.4 వేల చేయూత పెన్షన్ పెంపు!

    • ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

    • మెక్సికోలో విమాన ప్రమాదం , 10 మంది మృతి

    • ఆగని బస్సు ప్రమాదాలు , ఈరోజు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ రహదారిపై ఘోర ప్రమాదం

    • నేడే ‘విజయ్ దివస్’ ఎందుకు జరుపుకుంటారంటే !

    Trending News

      • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

      • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

      • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

      • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

      • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd