Kannappa : ‘కన్నప్ప’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు.. పుష్పకు పోటీగా రావట్లేదు..
పూర్తి మైథలాజికల్, పీరియాడిక్ సినిమాగా భక్త కన్నప్ప కథతో రానుంది ఈ సినిమా.
- By News Desk Published Date - 06:37 AM, Thu - 14 November 24

Kannappa : మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా తన సొంత నిర్మాణంలోనే బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ దర్శకత్వంలో కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో న్యూజిలాండ్ అడవుల్లో కన్నప్ప సినిమాని షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 80 శాతం షూటింగ్ అయిపోయిందని సమాచారం. పూర్తి మైథలాజికల్, పీరియాడిక్ సినిమాగా భక్త కన్నప్ప కథతో రానుంది ఈ సినిమా.
కన్నప్ప సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, అక్షయ్ కుమార్, ప్రభాస్, నయనతార, బ్రహ్మానందం.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. డిసెంబర్ మొదటి వారంలోనే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఉంది. కొంపతీసి పుష్ప కు పోటీగా కన్నప్ప రిలీజ్ చేస్తారా అని అంతా భావించారు. తాజాగా దీనిపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు మంచు విష్ణు. దర్శనానంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాను డిసెంబర్ లోనే రిలీజ్ చేద్దామని ముందు నుంచి అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కన్నప్ప సినిమా వాయిదా పడింది. 2025 సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం అని అన్నారు. దీంతో పుష్పకు పోటీగా అయితే కన్నప్ప రావట్లేదని క్లారిటీ ఇచ్చేసాడు. షూటింగ్ కాకపోవడం వల్లే సినిమా రిలీజ్ ని వాయిదా వేశారని తెలుస్తుంది. మరి 2025 సమ్మర్ కి అయినా వస్తుందా చూడాలి .
Also Read : Rashi Khanna Love Breakup : పాపం రాశిఖన్నా ‘లవ్ ఫెయిల్యూర్’..