Betting App Case : ఈడీ విచారణపై స్పందించిన మంచు లక్ష్మి
Betting App Case : ఈ కేసులో చివరిగా ప్రచారకర్తలుగా ఉన్న సెలబ్రిటీలను విచారించడం సరికాదని, అసలు ఈ వ్యవహారం ఎక్కడ మొదలైందో, దీని వెనుక ఎవరు ఉన్నారో ముందుగా చూడాలని ఆమె ఈడీకి పరోక్షంగా సూచించారు.
- By Sudheer Published Date - 02:20 PM, Sat - 13 September 25

బెట్టింగ్ యాప్‌ల కేసు(Betting App Case )లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన దర్యాప్తుపై నటి మంచు లక్ష్మి (Manchu Laxmi ) తన అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చివరిగా ప్రచారకర్తలుగా ఉన్న సెలబ్రిటీలను విచారించడం సరికాదని, అసలు ఈ వ్యవహారం ఎక్కడ మొదలైందో, దీని వెనుక ఎవరు ఉన్నారో ముందుగా చూడాలని ఆమె ఈడీకి పరోక్షంగా సూచించారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. “చిట్టచివరి వ్యక్తి వద్దకు వచ్చి విచారణ చేయడం హాస్యాస్పదంగా ఉంది” అని అన్నారు. ముందుగా ఈ బెట్టింగ్ యాప్‌లను ఎవరు ప్రారంభించారో, వాటికి మూలం ఎక్కడ ఉందో ఈడీ దర్యాప్తు చేయాలని ఆమె కోరారు. ఈ కేసులో ప్రధానంగా డబ్బు లావాదేవీల గురించి, ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో ఈడీ విచారించినట్లు ఆమె తెలిపారు. అయితే ఈ బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఉగ్రవాదులకు నిధులు అందుతున్నాయన్న విషయం తమకు తెలియదని ఆమె స్పష్టం చేశారు.
Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
“100 మందికి పైగా సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో నేనూ చేశానంతే” అని వివరించారు. ఈ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నప్పుడు వాటి వెనుక ఉన్న ఉగ్రవాద సంబంధాల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆమె పేర్కొన్నారు. తాము కేవలం ఒక ప్రకటనకర్తగా మాత్రమే వ్యవహరించామని, ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని ఆమె చెప్పకనే చెప్పారు.
మంచు లక్ష్మి వ్యాఖ్యలు ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ప్రముఖులు ఈ యాప్‌ల ప్రచారంపై అవగాహన లేకుండా వ్యవహరించారా, లేదా ఉద్దేశపూర్వకంగా చేశారా అన్న ప్రశ్నలకు ఆమె వ్యాఖ్యలు సమాధానమిచ్చాయి. అయితే, ఈడీ విచారణ ఏ దిశగా సాగుతుందో, ఈ కేసులో ఇంకెంతమంది ప్రముఖులు బయటపడతారో వేచి చూడాలి.