Dasari -Manchu : గురు శిష్యుల పరువు తీసిన కొడుకులు
Dasari -Manchu : ప్రస్తుతం మంచు ఫ్యామిలీ (Manchu Family) లో జరుగుతున్న ఆస్తుల గొడవలు ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది
- By Sudheer Published Date - 07:13 PM, Sat - 18 January 25

ఆస్తుల గొడవలు (Property Disputes) అనేవి ప్రతి ఇంట్లో ఉండేది. కని , పెంచి పెద్ద చేసి కొడుకును ఓ ప్రయోజకుడ్ని చేస్తే..అతడు మాత్రం మాకోసం ఏసంపాదించావు..? అని అడిగే కొడుకులు , కూతుళ్లు కొంతమందైతే..తండ్రి సంపాదించిన ఆస్తులు కోసం కొట్లాడే కొడుకులు మరికొంతమంది. ఇది సామాన్య ప్రజల ఇళ్లలోనే కాదు సినీ ప్రముఖుల ఇళ్లలో కూడా జరిగే తంతే. కాకపోతే సినిమా వాళ్లు కావడం తో వారి గొడవల గురించి అంత మాట్లాడుకుంటూ..వైరల్ చేస్తుంటారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ (Manchu Family) లో జరుగుతున్న ఆస్తుల గొడవలు ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. గతంలో కూడా ఇదే మోహన్ బాబు గురువైన దాసరి నారాయణ రావు (Dasari Narayanarao) ఇంట్లో కూడా ఇలాగే ఆస్తుల కోసం కొడుకులు రోడ్డెక్కారు.
Attack On Kejriwals Car : కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ఇది ఎవరి పని ?
తెలుగు ఇండస్ట్రీకి గురువుగా అంత కొలిచే దాసరి నారాయణరావు అనారోగ్యంతో 2017 లో కన్నుమూసిన సంగతి తెల్సిందే. ఇక దాసరికి ఇద్దరు కొడుకులు దాసరి అరుణ్, దాసరి ప్రభు.తండ్రి చనిపోయేవరకు కూడా వీరిద్దరూ సైలెంట్ గా ఉన్నారు. ఆ తరువాత ఆస్తులు కావాలంటూ రోడ్డెక్కారు. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సమస్యలను పరిష్కరించిన దాసరి..ఆయన కుటుంబంలోనే ఇలాంటి ఆస్తితగాదాలు తలెత్తడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అన్న ప్రభు ఉంటున్న ఇంటిపై అరుణ్ కన్నేశాడు. అది దాసరి.. ప్రభు కూతురు పేరున రాసాడు. అందుకు సంబంధించిన వీలునామా కూడా ఉంది. అయితే అందులో కూడా తనకు వాటా ఉందని అరుణ్ గొడవకు దిగాడు. అప్పుడు ఇండస్ట్రీ పెద్దలు అయిన మోహన్ బాబు, మురళీ మోహన్ తదితరులు జోక్యం చేసుకొని ఆ గొడవను సద్దుమణిగించారు. ఇండస్ట్రీ పెద్దగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దాసరి పరువు మొత్తాన్ని ఈ ఇద్దరు కొడుకులు తీసేశారు. ఇప్పుడు మోహన్ బాబు పరువు కూడా ఇద్దరు కొడుకులు తీస్తున్నారని అంత మాట్లాడుకుంటున్నారు. సినిమాల పరంగా మోహన్ బాబు పెద్దగా ఆస్తులు కూడపెట్టింది ఏమిలేదు కానీ విద్యాసంస్థల ద్వారా గట్టిగానే సంపాదించాడు. ఈ ఆస్తుల కోసం ఇద్దరు కొడుకులు గొడవలు పడుతున్నారు.
పెళ్లిళ్లు కాకముందు వరకు కలిసి ఉన్న ఈ అన్నదమ్ములు పెళ్లిళ్లు అయ్యాకా గొడవలు పడడం స్టార్ట్ చేశారు. మోహన్ బాబు ఆస్తి విషయంలో మనోజ్ కు అన్యాయం చేసాడని చిత్రసీమలో వినికిడి. అందుకే మనోజ్.. రోడ్డెక్కాడు అని మాట్లాడుకుంటున్నారు. తండ్రి – కొడుకుల మధ్య వార్ రోజు రోజుకు పిక్ స్టేజ్ కి వెళ్తుంది. ఒకరిపై ఒకరు దాడులు , పోలీస్ స్టేషన్ లలో కేసుల వరకు వెళ్లడమే కాదు సోషల్ మీడియా వేదిక కూడా తిట్ల దండకం చేసుకుంటూ తండ్రి పరువు తీస్తున్నారు. మరి వీరి ఆస్తుల గొడవలను సర్దుమణిగించే ప్రయత్నం ఎవరు తీసుకుంటారో అని అంత మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి మొన్నటి వరకు వివాదాలకు దూరంగా ఉండే మోహన్ బాబు..ఇప్పుడు కొడుకుల వల్ల రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి వచ్చిందని అభిమానులు బాధపడుతున్నారు.