Mallika Sherawat: ఆ కారణంగా చాలా సినిమాలలో అవకాశాలు కోల్పోయాను.. మల్లికా షెరావత్ కామెంట్స్ వైరల్?
- By Anshu Published Date - 09:13 AM, Fri - 16 February 24

మల్లికా షెరావత్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె బాలీవుడ్ సినిమాలతో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మ అసలు పేరు రీమా లాంబా, కానీ ఈ సినిమాల్లోకి వచ్చిన తర్వాత మల్లికా షెరావత్ గా మార్చుకుంది. అయితే షెరావత్ అనేది ఆమె తల్లి పుట్టింటి వారి ఇంటి పేరు. తన తల్లి తనకిచ్చిన మద్దతు కారణంగా తల్లి పేరును ఉపయోగిస్తున్నట్లు ఆమె పలు సందర్బాలలో చెప్పుకొచ్చింది. కాగా ఈ ముద్దుగుమ్మ కేవలం హిందీ సినిమాలలో మాత్రమే కాకుండా హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. 1997 లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే సమయంలో మల్లిక, డిల్లీకి చెందిన పైలట్ కరణ్ సింగ్ గిల్‌ను వివాహం చేసుకుంది.
కానీ ఆ తర్వాత ఆమెకు సినిమాలలో అవకాశాలు రావడంతో తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఖ్వాహిష్ (2003), మర్డర్ (2004) వంటి సినిమాలతో ఫుల్ పాపులర్ అయ్యింది. కాస్టింగ్ కౌచ్ కారణంగా తన కెరీర్‌పై ప్రభావం చూపిందని తెలిపింది. అయితే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురయ్యింది. వారిలో ఈ మల్లికా షెరావత్ కూడా ఒకరు. ఈ విషయం గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ అనుభవం కారణంగా నేను చాలా సినిమాలలో అవకాశాలు కోల్పోయాను.
సినిమా హీరోతో కాంప్రమైజ్ అవ్వనందుకు నాకు సినిమా ఛాన్స్ లు రాకుండా చేశారు అని చెప్పుకొచ్చింది మల్లికా. హీరో రాత్రి 3 గంటలకు ఫోన్ చేసి తన ఇంటికి రమ్మని పిలిచాడని, అలా వెళ్లలేదని తనకు సినిమా ఛాన్స్ లు రాకుండా చేశాడని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ చాలా తక్కువ సినిమాల్లో నటించింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ క్యాస్టింగ్ కౌచ్ కారణంగానే ఈమె సినిమా అవకాశాల విషయంలో చాలా వెనుకబడిందని చెప్పవచ్చు.