Director Raj : ‘మల్లేశం’ డైరెక్టర్ బాలీవుడ్ లో సినిమా.. సైలెంట్ గా సినిమా కంప్లీట్ చేసేశాడుగా..
తాజాగా మల్లేశం డైరెక్టర్ బాలీవుడ్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. రాజ్ దర్శకత్వంలో గుల్షన్, సయామీ ఖేర్ జంటగా '8AM మెట్రో' అనే ఓ సరికొత్త కథతో రాబోతున్నాడు.
- Author : News Desk
Date : 14-04-2023 - 7:37 IST
Published By : Hashtagu Telugu Desk
చేనేత కళాకారుల కోసం ఓ సరికొత్త మిషన్ తయారుచేసిన చింతకింది మల్లేశం బయోపిక్ ని మల్లేశం(Mallesham) సినిమాగా తెరకెక్కించారు. ప్రియదర్శి(Priyadarshi), అనన్య నాగళ్ళ(Ananya Nagalla) జంటగా 2019లో రాజ్(Raj) అనే దర్శకుడు మల్లేశం సినిమాను తెరకెక్కించగా మంచి విజయం సాధించింది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన మల్లేశం సినిమా కలెక్షన్స్ తో పాటు పలు అవార్డులను కూడా తీసుకొచ్చింది.
ఇప్పుడు తాజాగా మల్లేశం డైరెక్టర్ బాలీవుడ్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. రాజ్ దర్శకత్వంలో గుల్షన్, సయామీ ఖేర్ జంటగా ‘8AM మెట్రో’ అనే ఓ సరికొత్త కథతో రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
‘8AM మెట్రో’ పోస్టర్ లో ఓ మెట్రో ట్రైన్ లో సయామీ ఖేర్, గుల్షన్ ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే మెట్రో ట్రైన్ లో జరిగే లవ్ స్టోరీలా అనిపిస్తుంది. ఇన్నాళ్లు రాజ్ బాలీవుడ్ లో సినిమా కూడా చేస్తున్నాడని చాలా మందికి తెలీదు. తాజాగా ఈ పోస్టర్ తో రాజ్ సైలెంట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో మల్లేశం డైరెక్టర్ రాజ్ ను అందరూ అభినందిస్తున్నారు. మల్లేశం లాగే ఈ సినిమా కూడా మంచి విజయం కావాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ ‘8AM మెట్రో’ సినిమా మే 19న బాలీవుడ్ లో రిలీజ్ కానుంది.
GULZAR RELEASES FIRST LOOK POSTER OF GULSHAN DEVAIAH – SAIYAMI KHER STARRER ‘8 AM METRO’… #Gulzar unveiled #FirstLook poster of #Hindi feature film #8amMetro, starring #GulshanDevaiah and #SaiyamiKher.
Written-directed by #RajR [known for #Telugu film #Mallesham]…Distributed… pic.twitter.com/bfPdFTHej9
— taran adarsh (@taran_adarsh) April 14, 2023
Also Read : Kabzaa 2 : ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ తీస్తున్న డైరెక్టర్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..