Maldives Global Brand Ambassador : మాల్దీవ్స్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా
Maldives Global Brand Ambassador : ‘సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్’ ప్రచారంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాలను అందించాలన్నదే లక్ష్యమని ఆమె అన్నారు
- Author : Sudheer
Date : 10-06-2025 - 2:14 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రఖ్యాత బాలీవుడ్ నటి కత్రినా కైఫ్(Katrina Kaif)ను మాల్దీవులు దేశం తన గ్లోబల్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్(Maldives Global Brand Ambassador for Tourism)గా నియమించింది. ఈవిషయాన్ని మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. “కత్రినా కైఫ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సెలెబ్రిటీ. ఆమె తన సినిమాల ద్వారా మాత్రమే కాకుండా వ్యాపార రంగంలోనూ ఎన్నో పురస్కారాలు గెలుచుకున్న ప్రముఖ వ్యక్తి” అని అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
Telangana Rains : గాలివాన తిప్పలు.. పిడుగులతో ఉక్కిరిబిక్కిరి.. రాత్రంతా జాగారం
“మాల్దీవులు ఒక అందమైన స్వర్గధామంలాంటిది. ప్రకృతి, ప్రఖ్యాతి, ప్రశాంతత కలబోతగా కనిపించే ఈ దేశాన్ని ప్రమోట్ చేయడం గర్వంగా ఉంది” అంటూ కత్రినా పేర్కొన్నారు. ‘సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్’ ప్రచారంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాలను అందించాలన్నదే లక్ష్యమని ఆమె అన్నారు. ఇక పర్యాటకులను ఆకర్షించేందుకు విజిట్ మాల్దీవ్స్ పేరుతో ప్రత్యేక సమ్మర్ సేల్ ప్రచారాన్ని తాజాగా ప్రారంభించింది. ఇందులోభాగంగానే తనను రాయబారిగా ఎంపిక చేసినట్లు తెలిపింది.
Yoga Day : ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా : చిరంజీవి
ఈ ప్రకటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవుల పర్యటనకు నెల రోజుల ముందు రావడం విశేషం. గత సంవత్సరం మొదట్లో భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు సద్దుమణగిన తరువాత ఇప్పుడు పునఃప్రారంభమవుతున్న సానుకూల వాతావరణంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.