Malavika Mohanan : గ్రాజియా కవర్ పేజ్ పై రాజా సాబ్ బ్యూటీ..!
Malavika Mohanan రాజా సాబ్ సినిమా తో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది మాళవిక. ఈ సినిమాతో తెలుగులో తన సత్తా చాటాలని చూస్తుంది. అమ్మడి ఫోటో షూట్స్ కి స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. లేటెస్ట్ గా గ్రాజియా
- By Ramesh Published Date - 08:22 AM, Fri - 20 December 24

మళయాళ భామ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఓ పక్క సినిమాల్లో తన సత్తా చాటుతూనే మరోపక్క ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో అమ్మడి ఫోటో షూట్స్ ఎప్పుడూ ప్రేక్షకుల నుంచి ప్రత్యేక అలర్ట్ ని పొందుతాయి. మళయాల పరిశ్రమ నుంచి కెరీర్ మొదలు పెట్టిన అమ్మడు తమిళ్ లో సినిమాలు చేస్తూ అలరిస్తుంది. తెలుగు ఆడియన్స్ కి ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతోనే ఆకట్టుకున్న మాళవిక త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో అల్రించనుంది.
ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ సినిమా తో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది మాళవిక. ఈ సినిమాతో తెలుగులో తన సత్తా చాటాలని చూస్తుంది. అమ్మడి ఫోటో షూట్స్ కి స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. లేటెస్ట్ గా గ్రాజియా (Grazia) మేగజైన్ కోసం అమ్మడు ఫోటో షూట్ చేసింది. గ్రాజియా కవర్ పేజ్ మీద తన గ్లామర్ ట్రీట్ తో సర్ ప్రైజ్ చేసింది మాళవిక. గ్రాజియా కవర్ పేజ్ మీద రాజా సాబ్ బ్యూటీ లుక్కు అదిరిపోయింది.
సినిమాల పరంగా ఏమో కానీ మాళవిక తన ఫోటో షూట్స్ తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది. అమ్మడు ఏం చేసినా సరే సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలుస్తుంది. రాజా సాబ్ సినిమా హిట్ పడితే మాత్రం అమ్మడి ఫేట్ మారే ఛాన్స్ ఉంటుంది. తెలుగులో క్లిక్ అయిన హీరోయిన్స్ కి నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా టాలీవుడ్ మీద పెట్టింది మాళవిక.
యాక్టింగ్ లో టాలెంట్ చూపిస్తూ తన గ్లామర్ తో కూడా కుర్రాళ్లని డిస్ట్రబ్ చేయాలని చూస్తుంది మాళవిక. తెలుగులో హిట్ పడితే మాత్రం అమ్మడిని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.
Also Read : Chiranjeevi : చిరంజీవి సినిమా.. సాంగ్స్ లేకుండా చూస్తారా..!