Malaika with Mahesh: మహేశ్ తో మలైకా అరోరా.. SSMB 28లో ‘బాలీవుడ్’ ఐటెం బాంబ్!
మలైకా మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) కలిసి అందాలు ఆరబోయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
- By Balu J Published Date - 02:34 PM, Wed - 25 January 23

మలైకా అరోరా (Malaika Arora) అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లోనూ క్రేజ్ ఉన్న నటి. ఈ ఐటెం బ్యూటీ స్టెప్పులు వేసిందంటే ఫ్యాన్స్ కేవ్వు కేక అని అనాల్సిందే. అందుకే స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కిత్నీ హసీన్ జిందగీ, హూత్ రసీలే, ముని బద్నామ్ హుయీ, అనార్కలి డిస్కో చాలీ లాంటి ప్రసిద్ధ బాలీవుడ్ ఐటెం సాంగ్స్ తో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. SRK-నటించిన చయ్య చయ్యలో యువతను తనవైపు తిప్పుకుంది. ఈ పాటను ఇప్పటికీ అభిమానులు పాడుకోవడానికి ఇష్టం చూపుతుంటారు. కాగా ఈ బ్యూటీ (Malaika Arora) తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ పక్కన నటించి వారితో ఆడిపాడింది. ఇప్పుడు మలైకా అరోరా దశాబ్దం తర్వాత మళ్లీ టాలీవుడ్ తెరపైకి వస్తున్నట్లు కనిపిస్తోంది.
ఆమె చివరిగా 2012లో గబ్బర్ సింగ్‌లోని ‘కెవ్వు కేక’ పాటలో కనిపించింది. మలైకా మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) కలిసి అందాలు ఆరబోయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న SSMB 28 లో ఓ ప్రత్యేక పాటలో కనిపించబోతోంది. అయితే మేకర్స్ ఈ విషయాన్ని అధికారింగా వెల్లడించాల్సి ఉంది. ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా కనిపించనున్నారు. మలైకా అరోరా (Malaika Arora) తన డ్యాన్స్‌లు, ఎక్స్‌ప్రెషన్స్‌తో తెరపైకి రావడంతో ఆమెతో స్పెషల్ సాంగ్ చేయించి కథకు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.
Also Read: Kangana Twitter: ట్విట్టర్ లోకి కంగనా రీ ఎంట్రీ.. ఫస్ట్ అప్ డేట్ ఇదే!