Mahesh : రాజమౌళి కోసం సెంటిమెంట్ బ్రేక్ చేసిన మహేష్..!
Mahesh మహేష్ 29వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. రాజమౌళి మహేష్ ఈ కాంబినేషన్ అసలైతే 2010 లోనే సినిమా చేయాల్సి ఉన్నా అప్పటి నుంచి
- By Ramesh Published Date - 03:13 PM, Thu - 2 January 25

సూపర్ స్టార్ మహేష్ (Mahesh,) గుంటూరు కారం తర్వాత రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాకు నేడు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఐతే రాజమౌళి సినిమా కోసం మహేష్ తన సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు.
మహేష్ తన సినిమాల పూజా కార్యక్రమాలకు అసలు పాల్గొనడు. కొంతకాలంగా తన భార్య నమ్రతని మాత్రమే పంపిస్తున్నాడు. ఐతే రాజమౌళి సినిమా కాబట్టి మహేష్ తన సెంటిమెంట్ బ్రేక్ చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. హైదరాబాద్ అల్యుమినం ఫ్యాక్టరీలో పూజా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాజమౌళి (Rajamouli), మహేష్ పాల్గొన్నారు. ఐతే దీనికి సంబందించిన ఫోటోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు రాజమౌళి. మహేష్ 29వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. రాజమౌళి మహేష్ ఈ కాంబినేషన్ అసలైతే 2010 లోనే సినిమా చేయాల్సి ఉన్నా అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా మహేష్ 29వ సినిమాకు ఈ ఇద్దరి కలయిక జరుగుతుంది. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి.
సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుందన్న టాక్ ఉంది. అంతేకాదు మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో నటిస్తాడని అంటున్నారు. ఐతే కాస్టింగ్ విషయంలో ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు.