Mahesh : గుంటూరు కారం ఏం చేసినా ఫ్యాన్స్ కి నచ్చట్లేదు..!
సూపర్ స్టార్ మహేష్ (Mahesh) త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా విషయంలో మేకర్స్ ఏం చేసినా సరే అది ఫ్యాన్స్
- By Ramesh Published Date - 07:34 PM, Sat - 16 December 23
సూపర్ స్టార్ మహేష్ (Mahesh) త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా విషయంలో మేకర్స్ ఏం చేసినా సరే అది ఫ్యాన్స్ కి నచ్చట్లేదు. రీసెంట్ గా సినిమా నుంచి ఓ బేబీ సాంగ్ రిలీజైంది. సాంగ్ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ మిశ్రమ స్పందన ఇచ్చారు. అయితే దీనికి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఫ్యాన్స్ పై ఎక్స్ లో కామెంట్స్ చేశారు. ఇక నిర్మాత నాగ వంశీ కూడా ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ యానిమల్ సినిమా ఎండ్ కార్డ్ లో వీడియో పెట్టాడు.
ఏమైందో ఏమో కానీ ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశాడు. ఫ్యాన్స్ ని ఉద్దేశించి అలా చేస్తే రేపు పొద్దున్నే ఆ ఫ్యాన్స్ ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేసే అవకాశం ఉంది. మరి గుంటూరు కారం విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఎందుకు ఇంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అన్నది తెలియాల్సి ఉంది.
Also Read : Prabhas : సలార్ అర్ధరాత్రి 1 గంటకి షో..!
మరోపక్క ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన ట్వీట్ డిలీట్ వెనుక మహేష్ త్రివిక్రం ఉన్నారని తెలుస్తుంది. ఫ్యాన్స్ తో అనవసరమైన గొడవ వద్దని అతనికి చెప్పినట్టు టాక్. అందుకే నాగ వంశీ ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. ఏది ఏమైనా గుంటూరు కారం సినిమాపై ఫ్యాన్స్ మాత్రం నిరుత్సాహంగా ఉన్నారు.
మహేష్ తో అతడు, ఖలేజా సినిమాలు చేసిన త్రివిక్రం హ్యాట్రిక్ సినిమాగా గుంటూరు కారం చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
Related News
NTR Devara First Song : హుకుం సాంగ్ మర్చిపోతారట.. నిర్మాత కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!
NTR Devara First Song యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న తెచ్చేందుకు సిద్ధమయ్యారు.