Mahesh Babu: ‘దసరా’ మెచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. చాలా చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్..!
మంచి సినిమాలను మెచ్చుకునే అలవాటు ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇప్పుడు దసరా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నాని నటించిన ‘దసరా’ మూవీ బాక్సాఫీసును షేక్ చేస్తోంది.
- Author : Gopichand
Date : 01-04-2023 - 7:40 IST
Published By : Hashtagu Telugu Desk
మంచి సినిమాలను మెచ్చుకునే అలవాటు ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇప్పుడు దసరా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నాని నటించిన ‘దసరా’ మూవీ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే దసరా మూవీకి హీరో మహేశ్ బాబు స్టన్నింగ్ రివ్యూ ఇచ్చారు. ‘‘చాలా చాలా గర్వంగా ఉంది. అద్భుతమైన సినిమా’’ అంటూ చివరలో ఫైర్ ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మహేశ్ బాబు రివ్యూతో నాని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మహేష్ బాబు సినిమాపై స్పందించడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ తో పాటు శ్రీలక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ టీమ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేసింది.
So so proud of #Dasara!! Stunning cinema! 🔥🔥@NameisNani @KeerthyOfficial @Dheekshiths @thondankani @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP
— Mahesh Babu (@urstrulyMahesh) March 31, 2023
ఈ ట్వీట్‌కు వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్స్‌తో అభిమానుల నుంచి విపరీతమైన స్పందనలభిస్తోంది. తెలుగు ఇండస్ట్రీ నుండి దసరా మూవీని మెచ్చుకున్న మొదటి పెద్ద హీరో మహేష్ బాబు. దసరా చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మరోవైపు.. దసరా మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. నాని నటించిన ఈ చిత్రం ఇప్పటికే USA బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. శ్రీకాంత్ ఓదెల దసరాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. మంచి అంచనాల నడుమ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దసరా మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ఊచకోత కోస్తోంది.
మహేష్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమాను త్రివిక్రమ్‌తో చేస్తున్నారు. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్, దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ భారీ సినిమాను చేయనున్నారు.