Kurchi Madatapetti Song Record in Youtube : కుర్చీ మడతపెట్టి సాంగ్.. యూట్యూబ్ లో 200 మిలియన్ల రికార్డ్..!
Kurchi Madatapetti Song Record in Youtube సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకుంది. త్రివిక్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను హారిక హాసిని ప్రొడక్షన్
- By Ramesh Published Date - 06:27 PM, Sat - 20 April 24

Kurchi Madatapetti Song Record in Youtube సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకుంది. త్రివిక్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను హారిక హాసిని ప్రొడక్షన్ లో రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో థమన్ మ్యూజిక్ అందించారు. సినిమాలోని సాంగ్స్ అన్నీ ఇన్ స్టంట్ గా హిట్ కాగా ప్రత్యేకంగా కుర్చీ మడతపెట్టి సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
కుర్చీ మడతపెట్టి సాంగ్ లో మహేష్ డ్యాన్స్ కూడా అదిరిపోయింది. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో సెన్సేషనల్ రికార్డ్ సొంతం చేసుకుంది. గుంటూరు కారం లోని కుర్చీ మడతపెట్టి సాంగ్ యూట్యూబ్ లో 200 మిలియన్ల్ వ్యూస్ ని రాబట్టింది. మహేష్ నటించిన సర్కారు వారి పాటలోని కళావతి సాంగ్ 250 మిలియన్ల వ్యూస్ రాబట్టగా ఆ సాంగ్ తర్వాత సెకండ్ ప్లేస్ లో నిలిచింది.
కుర్చీ మడతపెట్టి సాంగ్ లో మహేష్ డ్యాన్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ అందించింది. శ్రీలీల స్టెప్పులను మ్యాచ్ చేస్తూ మహేష్ చేసిన మాస్ స్టెప్స్ అదిరిపోయాయి. మహేష్ కెరీర్ లో బెస్ట్ డ్యాన్స్ నెంబర్ గా గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ నిలుస్తుంది.
గుంటూరు కారం తర్వాత మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు. ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
Also Read : Pooja Hegde : దేవర ఐటం సాంగ్ తో ఊపు ఊపేందుకు సిద్ధమైన అమ్మడు..!