Japan Couple Kurchi Madatapetti Dance : జపాన్ జంట కుర్చీ మడతపెట్టి సాంగ్ డ్యాన్స్.. వీడియో వైరల్..!
Kurchi Madatapetti సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా
- By Ramesh Published Date - 10:17 AM, Fri - 23 February 24

Kurchi Madatapetti సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ హిట్ మేనియా కొనసాగిస్తూ గుంటూరు కారం వసూళ్లు అదరగొట్టాయి. ఈ సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అసలు డ్యాన్స్ అంటే ఆమడదూరం పారిపోయే మహేష్ కూడా ఇరగదీసి మరీ స్టెప్పులు వేశాడు. కుర్చీ మడతపెట్టి సాంగ్ లో మహేష్ డ్యాన్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సగటు సినీ అంభిమానులకు కూడా ఐ ఫీస్ట్ అందించాయి. నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్న గుంటూరు కారం సినిమా వరల్డ్ వైడ్ గా డిస్కషన్స్ లో ఉంటుంది.
ఇక జపాన్ లో ట్రెండింగ్ లో ఉన్న ప్రతి పాటని ముఖ్యంగా ప్రతి తెలుగు పాటకి డ్యాన్స్ చేసే ఒక క్రేజీ జంట లేటెస్ట్ గా మహేష్ గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్ కి కూడా స్టెప్పులేశారు. హాలీవుడ్ సినిమాల్లో పాటలనేవి ఉండవు. సినిమాను డిస్ట్రబ్ చేస్తాయని అక్కడ వాళ్లు అనుకుంటారు. ఎంతసేపటికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థీం సాంగ్స్ మాత్రమే ఉంటాయి. ఇలా హీరో హీరోయిన్ డ్యుయెట్స్ అక్కడ సాధ్యం కాదు. అందుకే మన ఇండియన్ సాంగ్స్ అక్కడ సూపర్ క్రేజ్ తెచ్చుకుంటాయి.
గుంటూరు కారం సాంగ్ ని యాజిటీజ్ దించేశారు ఈ జపాన్ జంట. నెక్స్ట్ మహేష్ చేసేది రాజమౌళి సినిమా కాబట్టి అంతకుముందే మహేష్ వర్లడ్ వైడ్ గా ట్రెండింగ్ అవుతున్నాడని చెప్పొచ్చు.