Guntur Karam: యాక్షన్ కు బాబు రెడీ.. ‘గుంటూరు కారం’ షూటింగ్ సెట్ లో మహేష్..!
మహేష్-త్రివిక్రమ్‌ల ‘గుంటూరు కారం’ (Guntur Karam) వివిధ కారణాల వల్ల నిరంతరం వార్తల్లో ఉంటుంది.
- By Gopichand Published Date - 02:24 PM, Sat - 24 June 23

Guntur Karam: మహేష్-త్రివిక్రమ్‌ల ‘గుంటూరు కారం’ (Guntur Karam) వివిధ కారణాల వల్ల నిరంతరం వార్తల్లో ఉంటుంది. నటీనటులు, సిబ్బంది, స్క్రిప్ట్‌లో చాలా మార్పులతో సినిమా షూట్ చాలా ఆలస్యమైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శనివారం హైదరాబాద్‌లో వేసిన హౌస్ సెట్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజాగా గుంటూరు కారం షూటింగ్ పై అప్డేట్ అందింది. ఈరోజు తదుపరి షెడ్యూల్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో చిత్రంలోని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు సమాచారం. అయితే నవంబర్ లోపు ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పదేళ్ల తర్వాత మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read: Chocolate: క్యాన్సర్ ని దూరం చేయడంలో చాక్లెట్ పాత్ర!
Superstar @UrstrulyMahesh is back in ACTION! 🔥🔥🎬🎬#GunturKaaram Latest Schedule Begins Today 🌶️ pic.twitter.com/JFIFw6rySR
— Guntur Kaaram (@GunturKaaram) June 24, 2023
అయితే ఈ చిత్రంలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న గుంటూరు కారం నుంచి పూజాహెగ్డే తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ప్లేస్‌లో మెయిన్ హీరోయిన్‌గా శ్రీలీల నటించనుందని.. సెకండ్ హీరోయిన్‌గా ‘హిట్-2’ భామ మీనాక్షి చౌదరినీ మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. హారికా అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 13న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు. గతంలో మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న సూపర్ స్టార్ తన తదుపరి చిత్రాన్ని రాజమౌళితో చేయనున్నాడు.