Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణలా మహేష్ బాబు కూడా.. అలా ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నాడు..
కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు కూడా.. ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాడు. కొన్ని కొత్త పద్ధతులు టాలీవుడ్ కి పరిచయం చేస్తూ ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటున్నాడు.
- By News Desk Published Date - 08:30 PM, Tue - 3 October 23
సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna) తెలుగు తెరకి ఎన్నో కొత్త విషయాలు పరిచయం చేసి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఫస్ట్ సినిమా స్కోప్ పిక్చర్, ఫస్ట్ 70mm, ఫస్ట్ కౌ బాయ్ పిక్చర్, ఫస్ట్ జేమ్స్ బాండ్ పిక్చర్, ఫస్ట్ ఈస్ట్ మ్యాన్ కలర్ ఫిలిం, ఫస్ట్ DTS ఫిలిం.. ఇలాంటి కొత్త హంగులు అన్ని కృష్ణ ద్వారానే తెలుగు తెరకు వచ్చాయి. ఇక ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు కూడా.. ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాడు. కొన్ని కొత్త పద్ధతులు టాలీవుడ్ కి పరిచయం చేస్తూ ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటున్నాడు. ఇంతకీ మహేష్ సెట్ చేసిన ఆ ట్రెండ్స్ ఏంటి..?
ప్రస్తుతం టాలీవుడ్(Tollywood) మేకర్స్ టీజర్, గ్లింప్స్, మోషన్ పోస్టర్.. అంటూ రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే వీటిలో చాలా వరకు మహేష్(Mahesh Babu) సినిమాతోనే టాలీవుడ్ లో స్టార్ట్ అయ్యాయి. టాలీవుడ్ లో టీజర్ రిలీజ్ అనే పద్ధతి స్టార్ట్ అయ్యింది ‘ఖలేజా’ సినిమాతోనే. ఇక ఈ మధ్య గ్లింప్స్ అనే పదాన్ని ఎక్కువుగా వింటున్నాము. ఇది మొదలు పెట్టింది కూడా మహేషే. మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్పైడర్’ మూవీకి.. ఒక రోబో స్పైడర్ తో చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. అప్పటిలో అది చాలా వైరల్ అయ్యింది. ఇక మోషన్ పోస్టర్ పద్దతి ‘1-నేనొక్కడినే’ సినిమా నుంచి మొదలైంది.
అంతేకాదు ఈ ‘1-నేనొక్కడినే’ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ అనౌన్స్మెంట్ కోసం ఒక టీజర్‌ని రిలీజ్ చేయడం, ఆ ఆడియో లాంచ్ ఈవెంట్ ని థియేటర్ లో లైవ్ టెలికాస్ట్ చేయడం, అలాగే ఈ ఈవెంట్ లో హీరోహీరోయిన్లను, ఇతర స్టార్స్ తో లైవ్ ‘Q&A’ సెషన్ నిర్వహించడంలో కూడా ట్రెండ్ సెట్ చేశారు. ఇక ‘ఆగడు’ మూవీ ఫస్ట్ లుక్ ని ఫ్యాన్స్ తో రిలీజ్ చేయించి మరో కొత్త పద్దతికి శ్రీకారం చుట్టారు. అలాగే ‘భరత్ అనే నేను’ సినిమాతో మొదటి ప్రమాణం వీడియో. ఇక ఈమధ్య మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ కూడా మహేష్ ‘పోకిరి’ సినిమాతోనే మొదలైంది. ఇలా తండ్రి బాటలోనే మహేష్ వెళ్తూ సరికొత్త పద్ధతులకు శ్రీకారం చుడుతున్నాడు.
Also Read : Amitabh Bachchan : 50వేల మంది రియల్ ఆడియన్స్ మధ్యలో సాంగ్ షూట్ చేసిన అమితాబ్ బచ్చన్..
Related News
Ashu Reddy : నా బాడీ సూపర్ డీలక్స్ అంటున్న అషు రెడ్డి..!
Ashu Reddy జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకుంది. కొన్నాళ్లు బుల్లితెర మీద షోలు చేసిన అమ్మడు ఆర్జీవితో కలిసి చేసిన ఇంటర్వ్యూ ఆమెను వైరల్ అయ్యేలా