Manoj Second Marriage: మేడ్ ఫర్ ఈచ్ అదర్.. మనోజ్ మనుసు దోచింది ఈమేనే!
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ రాజకీయ నాయకురాలి బిడ్డను పెళ్లిచేసుకోబోతున్నాడా? అంటే అవుననే అంటోంది టాలీవుడ్.
- Author : Balu J
Date : 23-12-2022 - 12:17 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) రెండో పెళ్లిపై గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకురాలు శోభా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డి (Mounika Reddy)తో ప్రేమాయణం నడిపించాలనే యోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. టాలీవుడ్ వర్గాల ప్రకారం.. మనోజ్, భూమా ఫిబ్రవరి 2023 రెండో వారంలో హైదరాబాద్‌లోని బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం (Marriage) చేసుకోనున్నారు. అయితే, నటుడు అతని కుటుంబం అధికారికంగా ఈవిషయాన్ని వెల్లడించాల్సి ఉంది.
మంచు మనోజ్(Manchu Manoj), భూమా మౌనిక రెడ్డి ఇటీవల ఒక పూజా కార్యక్రమంలో ఇద్దరూ కలిసి ఫోటో దిగిన తర్వాత పెళ్లి వార్తలపై మరిన్ని పుకార్లు వచ్చాయి. పెళ్లి వార్తలను నిజం చేసేలా ఇంటర్నెల్ లో అనేక వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ కడపలోని ప్రఖ్యాత పెద్ద దర్గాను కూడా సందర్శించుకొని వార్తల్లో నిలిచారు. మంచు మనోజ్ గతంలో ప్రణతి రెడ్డిని 2015లో వివాహం చేసుకున్నారు. అయితే 2019లో విడాకులు తీసుకున్నారు. ఇక సినిమాలపరంగా మంచు మనోజ్ (Manchu Manoj) చివరిసారిగా 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రంలో కనిపించాడు. అతిధి పాత్రలో 2018లో ‘ఆపరేషన్ 2019’ మూవీలో నటించాడు. ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.
Also Read: Kaikala Satyanarayana: నవరస నటసార్వభౌమ.. వి మిస్ యూ!