Samyukta : మేడమ్ సార్.. మేడమ్ అంతే..!
సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చి బింబిసార, సార్ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన అమ్మడు సాయి తేజ్ తో విరూపాక్ష సినిమాతో కూడా సక్సెస్
- By Ramesh Published Date - 11:52 PM, Sun - 4 August 24

Samyukta మలయాళ భామ సంయుక్త మీనన్ ఓ పక్క సినిమాల్లో తన అభినయంతో అలరిస్తూనే మరోపక్క తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది. అమ్మడు చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబడుతున్నాయి అందుకే సంయుక్త అంటే తెలుగులొ సూపర్ క్రేజ్ ఏర్పడింది. భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చి బింబిసార, సార్ సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన అమ్మడు సాయి తేజ్ తో విరూపాక్ష సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది.
ఐతే డెవిల్ సినిమాతో కాస్త నిరాశపరచిన సంయుక్త ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న స్వయంభు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది అమ్మడు. సంయుక్త మీనన్ సినిమాలతో పాటు తన గ్లామర్ షోతో ఫోటో షూట్స్ తో కూడా పాపులారిటీ తెచ్చుకుంటుంది. లేటెస్ట్ గా చిలక పచ్చ శారీలో అమ్మడి గ్లామర్ షో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Vijay Devarakonda : విజయ్ సినిమా రెండు భాగాలా..?
కట్టింది శారీనే అయినా అమ్మడి లుక్స్ క్రేజీ అప్పీల్ అందిస్తున్నాయి. తెలుగులో గోల్డెన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకున్న అమ్మడు కెరీర్ విషయంలో అంత దూకుడు చూపించట్లేదు. దానికి రీజన్ ఆమెకు నచ్చిన కథలు మాత్రమే చేయాలని అనుకుంటుంది. అందుకే కథలో ఏమాత్రం తేడా కొట్టినా సరే కాదనేస్తుంది.
సినిమాలతో అలరిస్తూ అడపాదడపా ఇలా ఫోటో షూట్స్ తో కూడా సంయుక్త తన టాలెంట్ చూపిస్తుంది. అమ్మడి లేటెస్ట్ లుక్స్ మాత్రం ఆడియన్స్ కు ఫీస్ట్ అందిస్తున్నాయి. ఐతే ప్రస్తుతం తెలుగులో యువ హీరోలతో మాత్రమే జత కడుతున్న అమ్మడు స్టార్ సినిమాలకు ప్రమోట్ అవ్వాలని చూస్తుంది. ఇక రెమ్యునరేష విషయంలో కూడా మరీ అంత పట్టింపులు ఏమి చూపించని సంయుక్త కథ నచ్చితే చాలని అంటుందట.