Vijay Devarakonda : విజయ్ సినిమా రెండు భాగాలా..?
సీక్వెల్ చేయాలా వద్దా అన్నది సినిమా రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుందని అన్నారు నాగ వంశీ (Naga Vamsy). ఇక ఈ సినిమాలో విజయ్ సరసన
- Author : Ramesh
Date : 04-08-2024 - 11:40 IST
Published By : Hashtagu Telugu Desk
Vijay Devarakonda రౌడీ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ తో హిట్ కొడతాడని అనుకోగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. వరుస ఫ్లాపులు పడుతున్నా కూడా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా గురించి అంచనాలు పెంచుతూ నిర్మాత నాగ వంశీ కామెంట్స్ ఆడియన్స్ కి సూపర్ కిక్ ఇస్తున్నాయి.
విజయ్ తో గౌతం చేస్తున్న ఈ సినిమా 2025 మార్చి 29న రిలీజ్ లాక్ చేసుకున్నారు. ఐతే సినిమా అవుట్ పుట్ మీద బీభత్సమైన నమ్మకం ఉన్న నిర్మాతలు సినిమాను రెండు భాగాలుగా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి సినిమా రెండు పార్ట్ లుగా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఐతే ఈ విషయంపై నిర్మత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.
నా సినిమాలతో రిస్క్ చేయను. కచ్చితంగా సినిమా హిట్ అయితేనే నెక్స్ట్ సీక్వెల్ గురించి ఆలోచిస్తానని అన్నారు. వీడీ 12వ సినిమాను కూడా సీక్వెల్ చేయాలా వద్దా అన్నది సినిమా రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుందని అన్నారు నాగ వంశీ (Naga Vamsy). ఇక ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read : Nani Saripoda Shanivaram : సరిపోదా శనివారం మేకింగ్ వీడియో.. హిట్ వైబ్ కనిపిస్తుందిగా..!
రవితేజ మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న అమ్మడు ఆ సినిమా రిలీజ్ కాకుండానే వరుస ఛాన్సులు అందుకుంటుంది. విజయ్ 12వ సినిమాలో భాగ్య శ్రీ అదరగొట్టబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని టాక్. జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గౌతం విజయ్ తో కూడా అంతకుమించి సినిమా అందించేందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ ని డిఫరెంట్ గా చూపించాలని ట్రై చేస్తున్నాడట గౌతం.