MAD Square : ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ చూసారా..?
MAD Square : లడ్డూ పెళ్లికి డైరెక్టర్ వెంకీ అట్లూరి, అనుదీప్ కేవీ, నిర్మాత నాగవంశీలు చదివింపులు ఇచ్చినట్లు టీజర్ ప్రారంభమైంది
- By Sudheer Published Date - 07:40 PM, Tue - 25 February 25

నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో 2023లో వచ్చిన ‘మ్యాడ్’ (MAD ) మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు..పాటలు , కామెడీ ఇలా ప్రతిదీ సినిమాకు హైలైట్ గా నిలువడం తో బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) మార్చి 29 న రాబోతుంది. ఈ క్రమంలో ఈరోజు మూవీ టీజర్ విడుదల చేసి ఆసక్తి పెంచారు.
AP Fiber Net : ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ ఆదిత్య
ఈ టీజర్ విషయానికి వస్తే .. లడ్డూ పెళ్లికి డైరెక్టర్ వెంకీ అట్లూరి, అనుదీప్ కేవీ, నిర్మాత నాగవంశీలు చదివింపులు ఇచ్చినట్లు టీజర్ ప్రారంభమైంది. ఇక అక్కడి నుంచి ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది . టీజర్ చూస్తుంటే ‘మ్యాడ్’కి మించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సీక్వెల్లో ఉండనున్నట్లు అర్థమవుతోంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో బాణీలు అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.