HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Macherla Niyojakavargam Nithiin In Action Mode

Macherla Niyojakavargam: ‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి నితిన్ ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు ఈ మధ్య అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.

  • By Hashtag U Published Date - 11:50 AM, Sat - 26 March 22
  • daily-hunt
Nithin
Nithin

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు ఈ మధ్య అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఒకప్పుడు వరుస హిట్లు అందుకున్న నితిన్… ఆ తర్వాత అదేస్థాయిలో వరుస ఫ్లాప్ లను చవిచూశారు. రీసెంట్ గా నితిన్ నటించిన సినిమాలు ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే… నితిన్ కు ‘భీష్మ’ హిట్ తర్వాత ఒక్క సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. వరుసగా మూడు సినిమాలు చేస్తే… ఆ మూడు కూడా బాక్సాఫీ వద్ద నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. దీంతో ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఈ క్రమంలో తన సొంత బ్యానర్ లోనే సినిమా చేస్తున్నాడు నితిన్. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో ఆదిత్యా మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ సహకారంతో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను చేస్తున్నాడు నితిన్. ఈ మూవీకి రాజశేఖరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రానికి సంబంధించి నితిన్ ఫస్టులుక్ ను శనివారం విడుదల చేశారు. డిఫరెంట్ లుక్ తో ఈ పోస్టర్లో నితిన్ కనిపిస్తున్నాడు. కుటిల రాజకీయ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమాలో నితిన్ పాత్ర ఎమోషన్ తో కూడిన యాక్షన్ తో నడుస్తుందనే విషయం ఈ పోస్టర్ చూడగానే అర్థమవుతోంది. ఫస్ట్ లుక్ లో దేనికైనా రెడీ అనేలా కనిపిస్తున్నాడు నితిన్. అవినీతి రాజకీయాలకు అడ్డుకట్టవేసే ఓ బలమైన యువకుడి పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. నితిన్ సరసన నాయికలుగా కృతి శెట్టి – కేథరిన్ నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా… నితిన్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా అనేది చూడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • first look
  • latest tollywood news
  • Macherla Niyojakavargam
  • Nithin

Related News

    Latest News

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd