Suspend : సినీనటి హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కఠిన చర్యలు
హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కఠిన చర్యలు తీసుకోనుంది
- By Sudheer Published Date - 08:57 PM, Wed - 5 June 24

బెంగుళూర్ రేవ్ పార్టీ (Bengaluru Rave Party) లో అడ్డంగా దొరికిన నటి హేమ(Hema) ఫై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కఠిన చర్యలు తీసుకుంది. బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కూడా దొరకడంతో.. ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వారిలో 86 మంది బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. వీరిలో నటి హేమకూడా ఒకరు. దీంతో మే 27వ తేదీన విచారణకు రావాలని హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే హేమ విచారణకు హాజరు కాలేదు. ఆ తర్వాత కూడా నోటీసులు జారీ చేసిన ఆమె హాజరుకాకపోవడంతో నేరుగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం హేమ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్ట్.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కఠిన చర్యలు తీసుకోనుంది. హేమ విషయమై కమిటీ సభ్యుల అభిప్రాయాలను ‘మా’ అధ్యక్షుడు (Maa President) మంచు విష్ణు కోరగా.. ఆమెను ‘మా’ నుంచి సస్పెండ్ (Suspend) చేయాల్సిందేనని మెజారిటీ మెంబర్స్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో రేవ్ పార్టీ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు ‘మా’ నుంచి ఆమెను సస్పెండ్ చేసేందుకు ‘మా’ అధ్యక్షుడు విష్ణు సిధ్ధమైనట్లు సమాచారం ఆమె అరెస్ట్ కాకముందు మంచు విష్ణు (Manchu Vishnu) ట్విట్టర్ వేదికగా ‘ఈ కేసులో హేమపై ఆరోపణలు నిరూపితమైతే.. పోలీసులు ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంటుంది’ అని ‘మా’ స్టాండ్‌ని ప్రకటించారు.
Read Also : AP – Telangana : పోరాడి గెలిచిన చంద్రబాబు.. సత్తా చాటుకున్న రేవంత్