Lucky Baskhar : ‘లక్కీ’ భాస్కర్ అనిపించుకున్నాడు
Lucky Baskar Talk : చాలీచాలని జీతం వచ్చే ఓ బ్యాంకు ఉద్యోగైన హీరో.. కుటుంబం కోసం అప్పులు చేసి, ఆ తర్వాత ఓ రిస్క్ చేస్తాడు. ఆ రిస్క్ ఏంటి..? ఆ రిస్క్ లో సక్సెస్ అయ్యాడా..? లేదా..? అనేది కథ
- By Sudheer Published Date - 07:55 AM, Thu - 31 October 24

వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటించినం చిత్రం లక్కీ భాస్కర్ (Lucky Bhaskar). ఈ చిత్రంలో సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి (Minakshi Choudhury) నటించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments)పై ఈ సినిమా తెరకెక్కింది. దుల్కర్ సల్మాన్ వివిధ భాషలలో తన అద్భుతమైన నటనతో బహుభాషా స్టార్ అని నిరూపించుకున్న సంగతి తెలిసిందే. మహానటి, సీతా రామం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు సినీ ప్రియులలో భారీ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న సల్మాన్..ఇప్పుడు లక్కీ భాస్కర్ అంటూ ఈరోజు దీపావళి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉందని చెపుతున్నారు.
చాలీచాలని జీతం వచ్చే ఓ బ్యాంకు ఉద్యోగైన హీరో.. కుటుంబం కోసం అప్పులు చేసి, ఆ తర్వాత ఓ రిస్క్ చేస్తాడు. ఆ రిస్క్ ఏంటి..? ఆ రిస్క్ లో సక్సెస్ అయ్యాడా..? లేదా..? అనేది కథ. హీరో ఎదుర్కొనే అవమానాలు ఆడియన్స్, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. అక్కడక్కడ ట్విస్టులు సినిమా పై మరింత ఆసక్తి పెంచుతాయని,. దుల్కర్ నటన, డైరెక్టర్ వెంకీ రచన, BGM, డైలాగ్స్ సినిమాకు బలాన్ని ఇచ్చాయని అంటున్నారు. స్టాక్ మార్కెట్, బ్యాంకుల పనితీరు గురించి తెలియని వారికి సెకండాఫ్ అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చని కొంతమంది అంటున్నారు. ఓవరాల్ గా మాత్రం సినిమాకు అన్నిచోట్లా సూపర్ హిట్ టాక్ వస్తుంది.
Read Also : India Vs China : బార్డర్‌లో స్వీట్లు పంచుకోనున్న భారత్-చైనా సైనికులు.. ఎందుకంటే ?