OG Movie : OG బ్లాక్ బస్టర్ హిట్ కావాలని లోకేష్ ట్వీట్
OG Movie : ఈ సినిమా పేరుకి Original Gangster అనే అర్థం ఉన్నప్పటికీ, పవన్ అన్న అభిమానులకు మాత్రం ఇది *Original God* అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.
- Author : Sudheer
Date : 24-09-2025 - 10:44 IST
Published By : Hashtagu Telugu Desk
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన OG మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. భ్ధువరం రాత్రి 10 గంటల నుండి షోస్ మొదలుకావడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మెగా హీరోలంతా పలు థియేటర్స్ లలో ప్రీమియర్ షోస్ చూస్తున్నారు. ఇటు చిత్ర సీమా ప్రముఖులే కాదు రాజకీయ నేతలు సైతం సినిమా విజయం కావాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో మంత్రి నారా లోకేష్ OG బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ట్వీట్ చేసారు.
ఈ సినిమా పేరుకి Original Gangster అనే అర్థం ఉన్నప్పటికీ, పవన్ అన్న అభిమానులకు మాత్రం ఇది *Original God* అంటూ లోకేష్ ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, ఆయనకున్న అపారమైన అభిమానాభిమాన్యం కారణంగా ప్రతి సినిమా ఓ ప్రత్యేకమైన వేడుకగా మారిపోతుంది. ఆయన తెరపై చేసే ప్రతి యాక్షన్ సీన్, ప్రతి డైలాగ్, ప్రతి స్టైల్ ఫ్యాన్స్‌కు ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ కారణంగానే ‘ఓజీ’పై అంచనాలు ఆకాశాన్నంటాయి.
Ladakh Violence: లద్ధాఖ్ హింస: నలుగురు మృతి, కేంద్రంపై పెద్ద ఆగ్రహం
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందింది. పవన్ కళ్యాణ్ కొత్త లుక్, స్టైల్, మాస్ యాక్షన్ ఫ్యాన్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రియాంకా అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతుండగా, థమన్ అందించిన సంగీతం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఫ్యాన్స్‌లో సినిమాపై భారీ ఆశలు రేపాయి. అంతేకాకుండా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది గర్వకారణంగా మారింది.
సినిమా విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్‌కి సిద్ధమవుతున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, బెనిఫిట్ షోలు, సోషల్ మీడియా ట్రెండ్స్ అన్నీ ఈ ఒక్క సినిమా చుట్టూ తిరుగుతున్నాయి. అభిమానులు తమ హీరోను కేవలం నటుడిగానే కాకుండా, ఒక దేవుడిలా* భావిస్తూ ఆయన ప్రతి విజయాన్ని తమదిగా చేసుకుంటారు. అందుకే ‘ఓజీ’ సూపర్ హిట్ కావాలని అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో ‘ఓజీ’ మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం కలుగుతోంది.
#OG అంటే Original Gangster. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం Original God. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #OG సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #TheycalllHimOG @PawanKalyan pic.twitter.com/LFfUbabPvY
— Lokesh Nara (@naralokesh) September 24, 2025