Lishalliny Kanaran: నటి చెస్ట్ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన పూజారి!
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. సెపాంగ్ జిల్లా పోలీసు అధిపతి ఎసిపి నోర్హిజం బహమన్ మాట్లాడుతూ.. అతను ఒక భారతీయ పౌరుడని, ఆలయంలోని స్థానిక పూజారి గైర్హాజరీలో తాత్కాలికంగా పూజలు నిర్వహిస్తున్నాడని నమ్ముతున్నాము అని అన్నారు.
- By Gopichand Published Date - 02:11 PM, Thu - 10 July 25

Lishalliny Kanaran: భారత సంతతికి చెందిన నటి, టెలివిజన్ హోస్ట్ కనరన్ (Lishalliny Kanaran) మలేషియాలోని ఒక హిందూ పూజారిపై ఆశీర్వాదం పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఈ ఘటన గత నెలలో సెపాంగ్‌లోని మరియమ్మన్ ఆలయంలో జరిగింది. 2021 మిస్ గ్రాండ్ మలేషియా విజేత లిషాలినీ కనరన్ సోషల్ మీడియాలో ఈ ఆరోపణలను పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె భారతీయ పూజారిపై “భారతదేశం నుండి తెచ్చిన పవిత్ర జలం” పోసిన తర్వాత అనుచితంగా తాకినట్లు ఆరోపించింది.
భారతీయ పూజారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. సెపాంగ్ జిల్లా పోలీసు అధిపతి ఎసిపి నోర్హిజం బహమన్ మాట్లాడుతూ.. అతను ఒక భారతీయ పౌరుడని, ఆలయంలోని స్థానిక పూజారి గైర్హాజరీలో తాత్కాలికంగా పూజలు నిర్వహిస్తున్నాడని నమ్ముతున్నాము అని అన్నారు. ఆ వ్యక్తి బాధితురాలి ముఖం, శరీరంపై పవిత్ర జలాన్ని చల్లి, ఆ తర్వాత ఆమెతో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
Also Read: Weather Report: నేటి నుండి భారత్- ఇంగ్లాండ్ మూడో టెస్ట్.. వర్షం ముప్పు ఉందా?
Lishalliny Kanaran says the incident happened on June 21, when she visited the temple alone to continue her journey into spirituality. https://t.co/0o3cEYlTgw
— The Star (@staronline) July 10, 2025
మోడల్ తన బాధను వివరించింది
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కనరన్ ఇలా పేర్కొంది. దర్యాప్తు అధికారి ఆమెను ఈ దాడి గురించి బహిరంగంగా చెప్పవద్దని హెచ్చరించారు. “మీరు అలా చేస్తే అది మీ తప్పు అవుతుంది. మీరే నిందించబడతారు” అని అన్నారు. ఆమె ఆ సలహాను పాటించకూడదని నిర్ణయించుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఘటన బాధాకరమైన వివరాలను పంచుకుంది. జూన్ 21న తన తల్లి భారతదేశంలో ఉండటం వల్ల ఆమె ఒంటరిగా ఆలయానికి వెళ్లింది. అక్కడ ఒక పూజారి ఉన్నారు. ఆయన సాధారణంగా నాకు ఆచారాలలో మార్గనిర్దేశం చేస్తారు. ఎందుకంటే నాకు ఇవన్నీ కొత్త, నాకు ఎక్కువ తెలియదు. నేను ఎల్లప్పుడూ ఆయన సహాయాన్ని అభినందించాను. ఆ రోజు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి, నాకు పవిత్ర జలం, రక్షా సూత్రం బంధించడానికి ఉన్నాయని, ఇది ఒక ఆశీర్వాదం అని చెప్పారు. ప్రార్థన తర్వాత కలవమని చెప్పారు అని రాసింది.
ఆ తర్వాత నటి ఒక గంటకు పైగా పూజారి కోసం వేచి ఉంది, అతను ఇతర భక్తులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కథనం ప్రకారం.. అతను నటిని తన ప్రైవేట్ కార్యాలయానికి రమ్మని చెప్పాడు. అక్కడ అతను ఆమెతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కనరన్ ఆరోపించింది, పూజారి మొదట ఆమెపై చాలా తీవ్రమైన వాసన కలిగిన ద్రవాన్ని పోసి, ఆమె కంటికి కొట్టినట్లు చేసాడు. ఆ తర్వాత ఆమె ఛాతీని తాకాడు. అతను ఆమెను బట్టలు విప్పమని కోరాడు. “ఇది నీ మంచికి” అని ఒత్తిడి చేశాడు. కానీ ఆమె నిరాకరించినప్పుడు.. పూజారి ఆమెను బిగుతైన బట్టలు ధరించినందుకు మందలించాడని తెలిపింది.
పూజారి తన చర్యను ఆశీర్వాదంగా పేర్కొన్నాడు
పరిస్థితి మరింత దిగజారింది. ఎందుకంటే పూజారి ఆమె వెనుక నిలబడి ఆమె బ్లౌజ్ లోపల చేతులు పెట్టి అనుచితంగా తాకాడని పేర్కొంది. అతను నేను తనతో ఇలా చేస్తే ఇది ‘ఆశీర్వాదం’ అవుతుందని, ఎందుకంటే అతను దేవుని సేవ చేస్తాడని చెప్పాడు. నా మనసు ఆ క్షణంలో ప్రతిదీ తప్పు అని తెలుసుకుంది. కానీ నేను కదలలేకపోయాను. నేను మాట్లాడలేకపోయాను. ఇంకా నాకు ఎందుకు అలా జరిగిందో అర్థం కావడం లేదు. ఈ విషయంలో ఆమె జులై 4న పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆమె ఆలయానికి వెళ్లినప్పుడు పూజారి అప్పటికే పరారీలో ఉన్నాడని తెలిపింది. ఆమె ఆలయ నిర్వహణపై, బాధితులకు సహాయం చేయడం కంటే తమ ప్రతిష్టను కాపాడుకోవడానికి ఈ విషయాన్ని దాచిపెట్టారని ఆరోపించింది. ఇంతకు ముందు కూడా ఎవరో ఇలాంటి ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని పేర్కొంది. మలేషియా పోలీసులు పూజారి కోసం గాలింపు ప్రారంభించారు.