Vijay & Ananya Chemistry: వావ్.. ‘విజయ్, అనన్య’ వాట్ ఏ కెమిస్ట్రీ!
విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లైగర్ మూవీ ఇప్పటికే సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.
- By Balu J Updated On - 12:41 PM, Sat - 6 August 22

విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లైగర్ మూవీ ఇప్పటికే సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా లైగర్ టీం మరో సాంగ్ ను రిలీజ్ చేసింది. ఆఫత్ పేరుతో విడుదల చేసిన ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ, అనన్య మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. సముద్రపు ఒడ్డులో పెప్పీ బీట్స్ తో హోరెత్తించారు. తనిష్క్ బాగ్చి, జహ్రా ఖాన్ వాయిస్ అందించగా, తనిష్క్ బాగ్చి సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ఆక్డీ పక్డీ పాట యూబ్యూట్ లో వైరల్ గా మారింది. అయితే ఆన్ స్క్రీన్ లో నే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో ఈ జంట మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇటీవల కరణ్ షో లో సెక్స్ లైఫ్ గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు ఈ ఇద్దరు. ఇక ప్రమోషన్స్ లోనూ ఓపెన్ ముద్దులాడుకుంటూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.
పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన లైగర్ ఆగస్టు 25న థియేటర్లలోకి రానుంది. పాన్-ఇండియా ప్రాజెక్ట్ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా లైగర్ ను నిర్మిస్తోంది. ఈ పాటకు విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “వైబ్ టు ది మోస్ట్ ఎలక్ట్రిక్ సాంగ్” అని క్యాప్షన్ ఇచ్చాడు.
Related News

VIjay Deverakonda: కరణ్ షో ఎఫెక్ట్.. ఛీజ్ అంటూ కామెంట్స్.. ఫీలైన విజయ్ దేవరకొండ!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ తాజాగా నటించిన