Lavanya Tripathi : అనాథాశ్రమంలో లావణ్య త్రిపాఠి..
తాజాగా లావణ్య త్రిపాఠి హైదరాబాద్(Hyderabad) LB నగర్ లోని ఓ అనాథశ్రమాన్ని(Orphanage) సందర్శించింది.
- By Hashtag U Published Date - 08:01 PM, Mon - 24 April 23

లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi).. అందాల రాక్షసి(Andala Rakshasi) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి అందర్నీ మైమరిపించింది. ఆ తర్వాత వరుసగా తెలుగు(Telugu), తమిళ్(Tamil) లో సినిమాలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఓటీటీలో(OTT) వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ప్రస్తుతం లావణ్య చేతిలో ఓ తమిళ సినిమా ఉంది. తాజాగా లావణ్య త్రిపాఠి హైదరాబాద్(Hyderabad) LB నగర్ లోని ఓ అనాథశ్రమాన్ని(Orphanage) సందర్శించింది.
హైదరాబాద్ LB నగర్లోని మార్గం రాజేష్ గత కొన్నాళ్లుగా ఓ అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళినవారు కొంతమంది జీవితంలో మంచిగా స్థిరపడ్డారు. తాజాగా నేడు ఉదయం లావణ్య ఈ అనాథాశ్రమాన్ని సందర్శించింది. అక్కడి పిల్లలతో కలిసి కాసేపు సరదాగా మాట్లాడింది. అనంతరం వారికి భోజనం ఏర్పాటు చేసి, వారితో పాటే తను కూడా అక్కడే భోజనం చేసింది.

అలాగే.. ఆ అనాథాశ్రమంలోని పిల్లలకు కావాల్సిన అత్యవసర మందులను అందించింది లావణ్య త్రిపాఠి. అనంతరం ఆ పిల్లలతో కలిసి ఫోటోలు దిగింది. దీంతో అనాథాశ్రమంలో పిల్లలతో కలిసి లావణ్య త్రిపాఠి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. అభిమానులు, పలువురు నెటిజన్లు లావణ్యను అభినందిస్తున్నారు.