See Pics: ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఫారిన్ లో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ!
జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ లో మూవీలో నటిస్తూనే.. ‘ఎవరు మీలో కోటిశ్వరులు’ ప్రోగ్రామ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది.
- By Balu J Published Date - 12:26 PM, Tue - 23 November 21

జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ లో మూవీలో నటిస్తూనే.. ‘ఎవరు మీలో కోటిశ్వరులు’ ప్రోగ్రామ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది. వరుస షెడ్యూల్స్ తో బిజీబిజీగా గడిపిన జూనియర్ ఎన్టీఆర్ కాస్త రిలాక్స్ అవ్వాలనుకున్నాడమో.. గ్యాప్ దొరకడంతో వెంటనే విదేశాల్లో వాలిపోయాడు. తన కొడుకు, భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. రెండురోజుల క్రితం ఇఫిల్ టవర్ దగ్గర కొడుకును ముద్దాడుతున్న ఎన్టీఆర్ పిక్స్ వైరల్ అయ్యాయి. తాజాగా తన కొడుకు భార్గవ్ రామ్, భార్య ప్రణతితో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యాయి. లోకల్ ట్రైన్ లో ఇష్టమైన ప్రాంతాలను చూస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నాడు.
ఆర్ఆర్ఆర్ గ్లింప్స్‌కు మామూలు ఆదరణ దక్కలేదు. ఈ గ్లింప్స్‌లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ చాలా తక్కువసేపే కనిపించినా.. ఎప్పటిలాగానే తన విజువల్స్‌తో మార్కులు కొట్టేశాడు రాజమౌళి. ఇక ఈ సినిమా నుండి విడుదలయిన ‘నాటు నాటు’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాట క్రేజ్ ఇండియాను దాటిపోయి అంతర్జాతీయ స్థాయి వరకు చేరిపోయింది. ఆర్ఆర్ఆర్ గ్లింప్స్‌లో ఒక్క డైలాగ్ కూడా లేదు. అందుకే పవర్‌ఫుల్ డైలాగులతో ట్రైలర్‌ను విడుదల చేయనుందట ఆర్ఆర్ఆర్ టీమ్. అయితే ఆ ట్రైలర్ విడుదల తేదిపై సోషల్ మీడియాలో ఓ రూమర్ మొదలయింది. డిసెంబర్ 4న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుందని నెట్టింట వైరల్ అవుతోంది. అధికారికంగా ఈ విషయం తెలియాల్సి ఉంది.
Related News

Bed Bugs Vs Paris : నల్లులతో ప్యారిస్ యుద్ధం.. జనం బెంబేలు
Bed Bugs Vs Paris : నల్లుల బెడదతో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ సతమతం అవుతోంది.