Kurchi Tata : కుర్చీ తాత ఫై శృంగార నటి పిర్యాదు..అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Author : Sudheer
Date : 24-01-2024 - 9:52 IST
Published By : Hashtagu Telugu Desk
కుర్చీ తాత(Kurchi Tata Arrest)ను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు (Hyderabad Jubilee Hills Police) అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది..అది కూడా శృంగార నటి పిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఖాళీగా తిరుగుతూ ఉండే షేక్ మహ్మద్ పాషా (కుర్చీ తాత) ఒకసారి తన బామ్మర్దిని కుర్చీ మడతపెట్టి కొడితే మెడలు విరిగిపోయాయని చెప్పాడు. ఈ డైలాగ్ వైరల్ కావడంతో షేక్ మహ్మద్ పాషా కాస్త… కుర్చీ తాత అయ్యాడు. కుర్చీ తాత యాటిట్యూడ్ కా బాప్. ఆయన మాటలు కరుకుగా కుంబద్దలు కొట్టినట్లు ఉంటాయి. ఈ లక్షణం యూట్యూబర్స్ ని ఆకర్షించింది. కుర్చీ తాతను ఇంటర్వ్యూ చేసేందుకు యూట్యూబ్ ఛానల్స్ క్యూ కట్టాయి. కుర్చీ తాతకు మంచి బట్టలు కొనిచ్చి, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు తీసుకునేవారు. తెలంగాణ అసెంబ్లీ సమయంలో కూడా కొంతమంది సీఎం కేసీఆర్ ను కావాలని తిట్టించి సొమ్ము చేసుకున్నారు. ఇలా చాలామంది యూట్యూబర్లు కుర్చీ తాత ను వాడుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో ‘కుర్చీ మడత పెట్టి’ (Kurchi Madatha Petti) సాంగ్ ఎంత పెద్ద వైరల్ అయ్యిందో తెలిసిందో. ఆ సాంగ్‌లో కుర్చీ తాత పాపులర్ డైలాగ్‌ను వాడికున్నందుకు గానూ.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. కుర్చీ తాతని ఇంటికి పిలిపించుకుని ఆర్ధిక సాయం అందించారు. దీంతో మరింత వైరల్ అయ్యాడు కుర్చీ తాత. అలాంటి ఈ పెద్దాయన ఫై శృంగార నటి స్వాతి నాయుడు (Swathi Naidu), వైజాగ్ సత్య (Vizag sathya) లు పోలీసులకు పిర్యాదు చేసారు.
తనని బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని.. తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయానని ప్రచారం చేస్తున్నాడని.. అందుకే పోలీసు స్టేషన్‌లో పిర్యాదు ఇచ్చినట్టు వైజాగ్ సత్య తెలిపారు. వాస్తవానికి వైజాగ్ సత్య సాయంతో తమన్‌ని కలిశాడు కుర్చీతాత. వైజాగ్ సత్య వల్లే తనకి గుర్తింపు వచ్చిందని చెప్పిన కుర్చీ తాత.. ఆ తరువాత రివర్స్ అయ్యారు. వైజాగ్ సత్య.. తన పేరు ఉపయోగించుకుని డబ్బులు సంపాదిస్తున్నాడని.. అతను కనిపిస్తే నరికేస్తా.. చంపేస్తా అంటూ బెదిరిస్తూ వీడియోలు షేర్ చేయడంతో వైజాగ్ సత్య .. కుర్చీ తాతపై పిర్యాదు ఇచ్చాడు. ఇక పోలీసులు రెండురోజులుగా కుర్చీతాత కోసం వెతికారని.. చివరికి బుధవారం అతడ్ని అరెస్ట్ చేసినట్లు సత్య తెలిపాడు. ఇప్పుడు కూడా యూట్యూబ్ వాళ్లు మందు పోయించి తిట్టమన్నారు కాబట్టే తిడుతున్నట్టు చెప్తున్నాడని.. అతని బూతులు భరించలేకే అరెస్ట్ చేయించినట్టు సత్య మీడియా కు తెలిపాడు.
Read Also : Devara Movie: ఎన్టీఆర్ ‘దేవర’ వాయిదా.. కారణం అదేనా..?