Devara Movie: ఎన్టీఆర్ ‘దేవర’ వాయిదా.. కారణం అదేనా..?
ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
- By Praveen Aluthuru Published Date - 09:20 PM, Wed - 24 January 24

Devara Movie: ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ చిత్రం ద్వారా భారీ విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, శ్రియ, అలియా భట్ ఇలా బాలీవుడ్ తారలు నటించారు. కొమరం బీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను కోలుకుంటూ జక్కన్న చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది.
ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న దేవర మొదటి పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తారని ఆల్రెడీ ప్రకటించారు. కానీ గత కొన్ని రోజుల నుంచి దేవర సినిమా వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి.
ఏప్రిల్ 5 టైమ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. జనాలు అంతా ఎలక్షన్ మూడ్ లో ఉంటే.. సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. మరో విషయం ఏంటంటే.. సైఫ్ ఆలీఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. ఆయన చేతికి గాయం అయ్యింది. ప్రస్తుతం ఆయన ముంబాయిలో చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇంకా 20 శాతం షూటింగ్ చేయాల్సివుంది. ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ పై యాక్షన్ సీన్స్ తీయాలి. ఈ కారణంగా కూడా దేవర అనుకున్న టైమ్ కి రావడం కష్టం. అందుకనే దేవర వాయిదా కన్ ఫర్మ్ అని తెలిసింది. ప్రస్తుతం ఈ విషయాన్ని ఎప్పుడు ప్రకటించాలి అని మేకర్స్ ఆలోచిస్తున్నారట. త్వరలోనే ఈ వార్తను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.
Also Read: China Jiangxi Fire: చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో అగ్ని ప్రమాదం.. 39 మంది మృతి