Krithi Shetty : కృతిశెట్టికి సూపర్ ఛాన్స్.. ‘లవ్ టుడే’ హీరోతో తమిళ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా..
తాజాగా మరో కొత్త సినిమా తమిళ్ లో ప్రకటించింది కృతిశెట్టి.
- Author : News Desk
Date : 15-12-2023 - 8:02 IST
Published By : Hashtagu Telugu Desk
కృతిశెట్టి(Krithi Shetty) మొదట్లో టాలీవుడ్(Tollywood) ని ఒక ఊపు ఊపేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి భారీగా అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. దీంతో లక్కీ హీరోయిన్ అంటూ కృతిశెట్టికి బాగా హైప్ ఇచ్చారు.
కానీ ఆ తర్వాత వరుసగా ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కృతిశెట్టి జోరు టాలీవుడ్ లో తగ్గిపోయింది. అప్పట్నుంచి కృతి ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటుంది. ప్రస్తుతం కృతి ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాలపైనే ఫోకస్ పెడుతుంది. తెలుగులో ఒక్క శర్వానంద్ సినిమా ఉండగా తమిళ్ లో రెండు, మలయాళంలో రెండు సినిమాలు కృతిశెట్టి చేతిలో ఉన్నాయి.
తాజాగా మరో కొత్త సినిమా తమిళ్ లో ప్రకటించింది కృతిశెట్టి. లవ్ టుడే సినిమాతో సెన్సేషన్ సృష్టించిన హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాధన్(Pradeep Ranganathan) హీరోగా, కృతిశెట్టి హీరోయిన్ గా నయనతార భర్త, తమిళ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్(Vignesh Shivan) దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియో ఆధ్వర్యంలో సినిమాని ప్రకటించారు. ఈ సినిమాకు లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) అనే సరదా టైటిల్ ని ప్రకటించారు. లవ్, కామెడీ జోనర్ లో ఈ సినిమా ఉండబోతుంది. డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఈ సినిమా తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పడం విశేషం.
ఈ సినిమా నిన్న పూజా కార్యక్రమాలు జరుపుకోగా చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ సినిమాలో SJ సూర్య, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ LIC సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు. దీంతో కృతి ఇప్పుడు తమిళ్ లో ఫుల్ బిజీ అవుతుంది. అయితే ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read : Mrunal Thakur : వయసులో చిన్నదైనా శ్రీలీలను చూసి స్ఫూర్తి పొందుతున్న మృణాల్ ఠాకూర్.. ఎందుకంటే?