Krishnam Raju : కృష్ణ చేయాల్సిన సినిమా కృష్ణంరాజు చేయడం.. ఎన్టీఆర్ నిర్మాతలను పిలిచి..
దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) దర్శకత్వంలో కృష్ణంరాజు 'కటకటాల రుద్రయ్య' (Katakatala Rudrayya) అనే ఒక సినిమా చేశారు. ఆ సినిమా అప్పటి యాక్షన్ చిత్రాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి.
- Author : News Desk
Date : 13-08-2023 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
కృష్ణంరాజు(Krishnam Raju).. ఇండస్ట్రీలో మాస్ హీరోగా ఆడియన్స్ చేత రెబల్ స్టార్(Rebel Star) అనిపించుకున్నారు. 1978లో దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) దర్శకత్వంలో కృష్ణంరాజు ‘కటకటాల రుద్రయ్య’ (Katakatala Rudrayya) అనే ఒక సినిమా చేశారు. ఆ సినిమా అప్పటి యాక్షన్ చిత్రాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. నిర్మాత వడ్డే రమేశ్ విజయ మాధవి సంస్థలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సంస్థలో దాసరి తెరకెక్కించిన తొలి సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో ఈసారి నిర్మాతకి ఎలాగైనా మంచి విజయాన్ని ఇవ్వాలనే కసితో దాసరి సినిమాని తెరకెక్కించారు. అనుకున్నట్లే మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.
అయితే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లేముందు చాలా పెద్ద కథే జరిగింది. అసలు ఈ మూవీలో హీరోగా సూపర్ స్టార్ కృష్ణ (Krishna) నటించాల్సింది. దాసరి ముందుగా కథ కూడా కృష్ణకే వినిపించాడు. కృష్ణ కూడా వెంటనే ఒకే చెప్పి డేట్స్ కూడా ఇచ్చేశాడు. అయితే షూటింగ్ మొదలయ్యే కొన్ని రోజులు ముందు నిర్మాతకి కృష్ణ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో వడ్డే రమేశ్, కృష్ణ ఇంటికి రాగా.. ఆయన ఇలా చెప్పారట. మీకు ఇచ్చిన డేట్స్ లోనే నేను ఇంకో మూవీ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక పని చేద్దాం.. మార్నింగ్ 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మీ సినిమాకు వర్క్ చేస్తా. అక్కడి నుంచి రాత్రి 9 గంటల వరకు వేరే వాళ్ళ మూవీ చేస్తాను మీకు ఓకేనా? అని అడిగారట.
దీనికి నిర్మాత.. అలా కుదరకపోవచ్చు అని ఒకే చెప్పలేదు. తాను ఇంకో హీరోని చూసుకుంటాను మీరు వాళ్లకే డేట్స్ ఇచ్చేయమని కృష్ణకి చెప్పారట నిర్మాత. ఇక కృష్ణ ఇంటి నుంచి వస్తూ మధ్య దారిలో ఉన్న కృష్ణంరాజు ఇంటికి వెళ్లారట. వడ్డే రమేష్ కు కృష్ణంరాజు మంచి మిత్రుడు. తాను నిర్మించబోయే ‘కటకటాల రుద్రయ్య’ సినిమాలో నువ్వే హీరో అని కృష్ణంరాజుకి చెప్పి దాసరి ఇంటికి తీసుకువెళ్లి జరిగిన విషయాన్ని మొత్తాన్ని చెప్పారట. దాసరి కూడా కృష్ణంరాజుని హీరోగా ఒకే చెప్పేశారు.
1978 అక్టోబర్ 11న విడుదలైన ఈ మూవీ రూ.18 లక్షల బడ్జెట్ తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద ఆ బడ్జెట్ కి 4 రేట్లు పైన.. అంటే అక్షరాలా రూ.75లక్షలు పైనే వసూలు చేసింది. ఇక ఈ మూవీ వసూళ్లు, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఇంస్ట్రీలో సెన్సేషన్ అయ్యి సీనియర్ ఎన్టీఆర్ (NTR) వరకు వెళ్లడంతో ఆ చిత్ర నిర్మాతలను పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు.
Also Read : Sameera Reddy : సినిమా ఇండస్ట్రీలో స్నేహితులు ఎవ్వరూ నాకు హెల్ప్ చేయలేదు.. చాలా బాధ వేసింది..