Kovai Sarala : కోవై సరళ పేరులో.. కోవై అంటే ఏంటో తెలుసా..?
కోవై సరళ పేరులో.. కోవై అంటే ఏంటో తెలుసా..? ఇప్పటివరకు పెళ్లి చేసుకొని ఈ నటి.. అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకుంటా అంటుంది.
- Author : News Desk
Date : 05-05-2024 - 12:10 IST
Published By : Hashtagu Telugu Desk
Kovai Sarala : తెలుగు సినిమాల్లో లేడీ కమెడియన్స్ ని చాలా తక్కువ చూస్తాము. ఇలా కనిపించిన కొంతమంది కమెడియన్స్ లో ఒకరు ‘కోవై సరళ’. తనదైన కామెడీతో, డైలాగ్ డెలివరీతో కోవై సరళ.. తెలుగు ఆడియన్స్ లో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ లో వచ్చిన కామెడీ సీన్స్ అయితే ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించేవి.
2012లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా తరువాత బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ మళ్ళీ కనిపించలేదు. 2016 నుంచి తెలుగు సినిమాల్లో కూడా కనిపించడం మానేశారు కోవై సరళ. డబ్బింగ్ సినిమాలతో మాత్రమే అప్పుడప్పుడు తెలుగు ఆడియన్స్ ని పలకరిస్తున్నారు. తాజాగా ఈ నటి.. స్టేర్ కమెడియన్ అలీ హోస్ట్ గా చేసే తెలుగు టాక్ షోకి గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో పలు ఆసక్తికర విషయాలు గురించి కోవై సరళ మాట్లాడారు.
అసలు కోవై సరళ పేరులో కోవై అంటే ఏంటని అలీ ప్రశ్నించారు. దానికి కోవై సరళ బదులిస్తూ.. “నేను పుట్టి పెరిగింది కోయంబత్తూర్ లోనే. అప్పటిలో కోయంబత్తూర్ ని షార్ట్ గా కోవై అని పిలిచేవారు. కోవై నుంచి వచ్చాను కాబట్టి నన్ను కోవై సరళ అని పిలవడం మొదలు పెట్టారు. అది కాస్త నా ఇంటి పేరుగా మారిపోయిందని” చెప్పుకొచ్చారు.
కోవై సరళది పెద్ద కుటుంబం. మొత్తం నాలుగు సిస్టర్స్, ఒక బ్రదర్. అందరూ ప్రస్తుతం మంచి పొజిషన్ కోయంబత్తూర్ లోనే ఉన్నారట. కాగా కోవై సరళ పెళ్లి చేసుకోలేదు. తన బ్రదర్ అండ్ సిస్టర్స్ పిల్లలనే తన పిల్లలుగా భావిస్తుంటారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో కోవై సరళని అలీ ఒక ప్రశ్న అడిగారు. “ఇప్పటివరకు పెళ్లి చేసుకొని మీరు, ఇప్పటి హీరోల్లో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే.. ఎవరని చేసుకుంటారు..?” అని ప్రశ్నించారు. దానికి కోవై సరళ బదులిస్తూ.. “అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకుంటా” అని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ తో కలిసి కోవై సరళ దేశముదురు సినిమాలో నటించారు.