Adipurush: తిరుమల సన్నిధిలో ముద్దులు.. ఓంరౌత్, కృతి సనన్ పై విమర్శలు!
ఒకరికొకరు సెండాఫ్ ఇచ్చుకునే క్రమంలో కౌగిలించుకోవడం కామన్. కానీ తిరుమల సన్నిధిలో అలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
- By Balu J Published Date - 11:16 AM, Wed - 7 June 23

నిన్న తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఊహించనివిధంగా సక్సెస్ అయ్యింది. వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఈ వేడుక కోసం వచ్చిన దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్.. తిరుమలను దర్శించుకున్నారు. అయితే దర్శనం తర్వాత ఆలయం ముందు ఒకరికొకరు సెండాఫ్ ఇచ్చుకునే క్రమంలో కౌగిలించుకోవడం ముద్దుపెట్టుకోవడం వివాదంగా మారింది. తిరుమల ఆలయం ముందు ఏంటీపని అంటూ నెటిజన్స్ ట్రోలింగ్ మొదలైంది. బుధవారం ఉదయం అర్చన సేవలో ఆదిపురుష్ టీమ్ పాల్గొంది. దర్శకుడు, హీరోయిన్.. శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం బయటకు వచ్చారు.
అప్పటికే హీరోయిన్ కి ఫ్లైట్ టైమ్ అవుతోంది. దీంతో ఆమె హడావిడిగా అక్కడినుంచి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అక్కడే ఆమెకు సెండాఫ్ ఇచ్చారు దర్శకుడు ఓంరౌత్. ఈ క్రమంలో ఆమెను కౌగిలించుకుని బుగ్గపై ముద్దు పెట్టుకున్నారు, వీడ్కోలు పలికారు. వీడ్కోలు సమయంలో ఇలాంటివన్నీ సహజమే అయినా తిరుమల ఆలయం ముందు ఈ సన్నివేశం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. అక్కడే ఉన్న భక్తులు ఇదేంపని అంటూ గుసగుసలాడుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్, హీరోయిన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Air India Flight : అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్.. రష్యా వెళ్ళింది.