HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >King Nagarjuna Akkineni Comments On Karthi And Pawan

King Nag Comments: ఇక్కడ పవన్ కళ్యాణ్, అక్కడ కార్తీ.. వెరీ రేర్ యాక్టర్స్!

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న

  • Author : Balu J Date : 20-10-2022 - 11:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nag
Nag

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. సర్దార్‌లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో కార్తి చిత్రంలోని ‘నేనే సేనాపతి’ పాటకు వేదికపై మాస్ డ్యాన్స్ చేయడం అందరినీ అలరించింది.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. కార్తితో ఊపిరి సినిమా చేశాను. అప్పటి నుండి కార్తితో అనుబంధం మొదలైయింది. అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్ ని ప్రజంట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా వుంది. ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా చేసినందుకు కార్తి గర్వపడుతున్నానని చెప్పారు. కార్తి అన్న సూర్య సూపర్ స్టార్. ఆ సూపర్ స్టార్ నీడ నుండి బయటికి వచ్చి ప్రూవ్ చేసుకోవడం చాలా అరుదు. అలాంటి వాళ్ళని ఇద్దరినే చూశాను. ఇక్కడ మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్.. కన్నడలో శివన్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్.. తమిళనాడులో సూర్య తమ్ముడు కార్తి. ఇలా స్టార్ డమ్ సంపాయించడం మామూలు విషయం కాదు. కార్తి చాలా వైవిధ్యమైన సినిమాలు చేసి సూర్య అంత సూపర్ స్టార్ అయ్యారు. కార్తి తెలుగులో మాట్లాడటమే కాదు పాటలు కూడా పాడుతాడు. తెలుగు మాట్లాడేవాళ్ళని మనం వదలం. అభిమన్యుడు ఫేం పిఎస్ మిత్రన్ అద్భుతమైన దర్శకుడు. సర్దార్ ని కూడా గొప్పగా తీసుంటాడని నమ్ముతున్నాను. అక్టోబర్ 21న అందరూ థియేటర్ లో ‘సర్దార్’ చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు.

హీరో కార్తి మాట్లాడుతూ.. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నాగార్జున అన్నయ్య ఈ ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. అలాగే ఈ సినిమాని నాగార్జున గారు తెలుగు విడుదల చేయడం చాలా థ్రిల్ గా వుంది. సర్దార్ నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ. తొలిసారి తండ్రి కొడుకులుగా నటించాను. ఇందులో స్పై పాత్ర చాలా స్పెషల్. సర్దార్ గ్రేట్ హీరో. ఏమీ ఆశించకుండా దేశం కోసం పని చేసిన హీరో. ఆ పాత్ర చేసినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను. పోలీస్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఈ జనరేషన్ కు తగ్గట్టుగా వుంటుంది. ఒక సినిమాలో రెండు జనరేషన్లు చూపించడం ఒక సవాల్. ఇది ఇండియన్ స్పై థ్రిల్లర్. అభిమన్యుడు ఫేం పిఎస్ మిత్రన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. అభిమన్యుడులో డిజిటల్ క్రైమ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లే ఇందులో కూడా మన కళ్ళ ముందు వుండి, మనం పెద్దగా పట్టించుకొని ఒక ముఖ్యమైన విషయాన్ని చూపించారు. సర్దార్ లో అది గొప్ప సర్ ప్రైజ్ గా వుంటుంది. రాశి ఖన్నా, రజీషా, లైలా అద్భుతంగా నటించారు. జార్జ్ కెమరా పనితనం బ్రిలియంట్ గా వుంటుంది. జీవి పప్రకాష్ కుమార్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత లక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు. నా కెరీర్ లో బిగ్ బడ్జెట్ చిత్రమిది. దాదాపు పాన్ ఇండియా షూట్ చేశాం. దీపావళి కి ఖైధీ సినిమా వచ్చింది. ఈ దీపావళికి ఒక పండగలా క్రాకర్ లా సర్దార్ సినిమా రాబోతుంది. అక్టోబర్ 21న సర్దార్ వస్తోంది. అందరూ తప్పకుండా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు.

రజిషా విజయన్ మాట్లాడుతూ.. గీతాంజలి చూసి నాగార్జున గారి అభిమానిగా మారిపోయా. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. సర్దార్ దీపావళి కానుకగా అక్టోబర్ 21న వస్తోంది. ఇందులో ఇందిరా అనే పాత్రలో కనిపిస్తా. చాలా ప్రేమతో ఈ సినిమా చేశా. ప్రేక్షకులకు సర్దార్ పర్ఫెక్ట్ దీపావళి కానుక కాబోతుంది. లవ్, కామెడీ, యాక్షన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ వున్న స్పై థ్రిల్లర్ సర్దార్. ప్రేక్షకులని తప్పకుండా వినోదం పంచుతుంది. అందరూ థియేటర్ కి వచ్చి సినిమా చూడాలి” అని కోరారు.

లైలా మాట్లాడుతూ.. సర్దార్ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్, నేను నటించిన శివపుత్రుడు దీపావళి కి విదుదలై ఘన విజయం సాధించింది. సర్దార్ కూడా అదే రోజు వస్తోంది. దీపావళి నా పుట్టిన రోజు కూడా. కార్తి గారు అద్భుతంగా నటించారు. మిత్రన్ గారు చాలా మంచి సినిమాని తీశారు. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు.

రాకేందుమౌళి మాట్లాడుతూ.. మనం చేసే పని పదిమందికి పనికొస్తే చాలు వాళ్ళ మెచ్చుకోలుతో అవసరం లేదు. ఇదీ సర్దార్ థీమ్.పిఎస్ మిత్రన్ అద్భుతంగా తీశారు. ఈ సినిమాని మాటలు రాయడం ఆనందంగా వుంది. కార్తి అన్నకి సర్దార్ మైల్ స్టోన్ గా నిలిచే సినిమా అవుతుంది” అన్నారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • karthi
  • king nag
  • Pawan Kalyan
  • sardar

Related News

Pawan Kalyan Ustad Bhagat Singh Working stills released from Movie Unit Shootings not stopped with Chandrababu Arrest

Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

రాబోయే రోజుల్లో ఏవైనా సెలవు దినాలు కలిసి వస్తే తప్ప, ఈ 100 కోట్ల గ్రాస్ టార్గెట్ రీచ్ అవ్వడం సవాలుతో కూడుకున్న పని. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరియు సినిమాల మధ్య ఉన్న గ్యాప్ వల్ల అభిమానులు

  • Pawan Prakash Raj

    ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

  • Pawan Speech Assembly

    AP Assembly : లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్

  • Bari Opening

    Pawan Kalyan : నిహారిక – వరుణ్ తేజ్ లకు పవన్ సపోర్ట్ ..ఓపెనింగ్ తోనే హైప్ తెచ్చుకున్న ‘బరి’

  • Pawan Kalyan Election Campa

    Pawan Kalyan Election Campaign : తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

Latest News

  • భార‌త మార్కెట్లోకి కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ధ‌ర ఎంతంటే?

  • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

  • శాశ్వత ప్రజా రాజధానిగా అమరావతి!

  • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

  • స్టేడియంలో సిగ‌రెట్ తాగిన జ‌ర్న‌లిస్ట్‌, వీడియో వైర‌ల్‌!

Trending News

    • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

    • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd